BigTV English

Operation Sindoor : 24 మిస్సైళ్లు.. 25 నిమిషాలు.. 9 టార్గెట్లు.. కంప్లీట్ డీటైల్స్..

Operation Sindoor : 24 మిస్సైళ్లు.. 25 నిమిషాలు.. 9 టార్గెట్లు.. కంప్లీట్ డీటైల్స్..

Operation Sindoor : 25 నిమిషాలు.. 24 మిస్సైళ్లు.. 9 టార్గెట్లు.. క్లుప్తంగా ఆపరేషన్ సిందూర్ ఇది. పాక్‌ ముష్కర మూకపై త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం. సరిగ్గా రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు ఆపరేషన్‌ మొదలైంది. గ్రౌండ్‌ లాంచ్‌, ఎయిర్ లాంచ్‌ మిస్సైళ్లతో ఎటాక్ చేశాయి. నిఘా డ్రోన్లతో టార్గెట్స్‌ మానిటరింగ్‌ చేస్తూ.. టార్గెట్స్‌ చుట్టుపక్కల పౌరులు గాయపడకుండా జాగ్రత్త తీసుకున్నాయి. లేజర్‌ మిస్సైళ్లు, శాటిలైట్ గైడెడ్‌ మిసైళ్లతో ఎటాక్‌ చేశాయి. ఒంటిగంట 30 నిమిషాలకు ఆపరేషన్ ముగిసింది. జస్ట్‌ 25 నిమిషాల్లోనే 9 టార్గెట్లపై మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి త్రివిధ దళాలు. నిమిషానికి ఒక మిస్సైల్‌ చొప్పున, 24 మిస్సైళ్లతో దాడులు చేశాయి. ఈ అటాక్‌లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 60 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి.


జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్ స్మాష్

P.O.K లో ఐదు ప్రాంతాలు, పాక్‌లో నాలుగు ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాయి. బహవల్‌పూర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన హెడ్ క్వార్టర్ పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు ఈ ప్రాంతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ అటాక్‌లో 14 మంది చనిపోయారు. మృతుల్లో జైషే మహ్మద్‌ చీఫ్ మసూద్‌ అజర్‌ ఫ్యామిలీకి చెందిన పది మంది ఉన్నారు.


మసూద్ అజార్ ఫ్యామిలీ ఫసక్

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్ అజార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌ చేసిన మిస్సైళ్ల దాడిలో అతడి ఫ్యామిలీ హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. 10 మంది కుటుంబ సభ్యులు, నలుగురు అనుచరులు చనిపోయినట్లు సమాచారం. మృతుల్లో మసూద్ అజార్‌ సోదరి, బావ ఉన్నట్లు తెలిసింది. వీరంతా బహవాల్‌పూర్‌లోని జైషే మహ్మద్‌ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

Also Read : మోదీకి చెబితే ఎట్టా ఉంటాదో తెలుసా? మొనగాడ్రా బుజ్జీ..

పాక్ పౌరుల రియాక్షన్

ఇక, భారత్ అటాక్ చేసిన దృశ్యాలను పాకిస్తాన్ పౌరులు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. మిడ్ నైట్ ఓ మిస్సైల్ దాడి జరగ్గా.. సమీపంలోని పాకిస్తానీయులు అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ పారిపోయే విజువల్స్ కనిపించాయి. మరో వీడియోలో.. పాక్‌లోని మురిడ్కే లో ఉగ్రవాద స్థావరంగా ఉన్న మసీదులపై భారత మిస్సైళ్లు విరుచుకుపడ్డాయి. రాత్రి 12.45 కి మొదట ఒక డ్రోన్ వచ్చిందని.. తరువాత మరో మూడు డ్రోన్లు వచ్చి.. అవి మసీదులపై దాడి చేశాయని చెబుతున్నారు. డ్రోన్ దాడిలో ఆ ప్రాంతం పూర్తిగా ధ్వంసం అయిందని.. తామంతా తీవ్ర భయాందోళనలో ఉన్నామని.. స్థానికులు చెబుతున్నారు.

మోదీకి చెబితే ఎట్టా ఉంటాదో తెలుసా?

ఒకానొక మ్యాచ్‌లో.. పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అక్తర్.. భారత ఓపెనర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌లపై బౌన్సర్లు విసురుతున్నాడు. 150 kmph వేగంతో తూటాల్లాంటి బాల్స్ వేస్తున్నాడు. బంతులతో పాటు ముళ్లల్లాంటి మాటలతో వీరేంద్ర సెహ్వాగ్‌ను స్లెడ్జింగ్ కూడా చేస్తున్నాడు. మనోడికి చికాగొచ్చింది. దమ్ముంటే ఇవే మాటలు సచిన్‌‌ను అను చూద్దాం అని సవాల్ చేశాడు. షోయబ్ అక్తర్.. టెండూల్కర్‌పై కూడా డైలాగ్ వార్ స్టార్ట్ చేశాడు. ఇక అంతే. సచిన్ బాదుడే బాదుడు. ఫోర్లు, సిక్సులతో షోయబ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ఇదంతా ఇప్పుడు రిలవెంటో కాదో తెలీదు కానీ.. పాకిస్తాన్‌పై ఇండియా అటాక్ చేసిన సందర్భంగా ఆ టాపిక్ గుర్తుకొస్తోంది. పహల్గాంలో ముష్కరులు యువతి కళ్ల ముందే ఆమె భర్తను కాల్చి చంపారు. తమకు వారం క్రితమే పెళ్లి అయిందని.. భర్త లేకుండా తాను బతకలేనని.. తనను కూడా చంపేయమంటూ ఆ యువతి ఉగ్రవాదుల కాళ్లపై పడింది. ఆ ఉన్మాదులు వెటకారంగా.. వెళ్లి మోదీకి చెప్పు.. అంటూ మరింత రెచ్చగొట్టారు. ఆ ఘటన యావత్ భారతీయులను రగిలించింది. మోదీకి చెబితే ఎలా ఉంటాదో.. ఇప్పుటికి తెలిసొచ్చింది ఆ టెర్రరిస్టులకు. వాళ్లింకా బతికే ఉన్నారు. కశ్మీర్ అడవుల్లో నక్కినక్కి.. బిక్కు బిక్కుమంటూ దోబూచులాడుతున్నారు. మే 6 మిడ్ నైట్ పాకిస్తాన్‌పై ఇండియా అటాక్ చేసిన మేటర్ ఈ పాటికి ఆ నలుగురు ఉన్మాదులకు తెలిసే ఉంటుంది. 9 చోట్ల, 24 మిస్సైల్స్‌తో సుమారు 100 మంది ఉగ్రవాదులను లేపేసిన సంగతి ఆ రాక్షసులకు అందే ఉంటుంది. వెళ్లి మోదీకి చెప్పు.. అన్నోడి వెన్నులో వణుకు పుట్టే ఉంటాది. ఖబడ్దార్ ఉగ్రవాదుల్లారా.. ఖబడ్దార్ పాకిస్తాన్. భారత్‌పై ఇంకోసారి కన్నెత్తి చూస్తే.. ఇలా మీ ఇంటికొచ్చి చంపేస్తాం.. అంటూ యావత్ భారతీయులు రొమ్మువిరుచుకుని మరీ వార్నింగ్ ఇస్తున్నారు.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×