BigTV English

PM Modi Ram Mandir | ప్రధాని మోదీ అయోధ్యలో దర్శించిన ఆలయాల విశేషాలివే..!

PM Modi Ram Mandir | అయోధ్య రామమందిరంలో జనవరి 22, సోమవారం మధ్యాహ్నం 12:29:08 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆయన గత వారం రోజులుగా కంకణ ధారయై, అనుష్ఠానంలో ఉన్నారు.

PM Modi Ram Mandir | ప్రధాని మోదీ అయోధ్యలో దర్శించిన ఆలయాల విశేషాలివే..!

PM Modi Ram Mandir | అయోధ్య రామమందిరంలో జనవరి 22, సోమవారం మధ్యాహ్నం 12:29:08 గంటలకు ప్రధాని నరేంద్రమోదీ బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆయన గత వారం రోజులుగా కంకణ ధారయై, అనుష్ఠానంలో ఉన్నారు. ఇందులో భాగంగా దేశంలో రాముని జీవితంతో ముడిపడి ఉన్న పలు పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకుంటున్నారు. మహారాష్ట్ర నాసిక్‌లోని మహాకుండ్‌ కాలారామ్‌ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, కేరళలోని గురువాయర్‌ ఆలయం, త్రిప్రయార్‌ రామస్వామి ఆలయాలను ఇప్పటికే దర్శించుకున్న మోదీ.. తాజాగా తమిళనాడులోని ఆలయాలను సందర్శించారు. వాటి విశేషాలు..


నేడు ప్రధాని మోదీ తమిళనాడులోని ధనుష్కోటిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పూజలు చేశారు. విభీషణుడు శ్రీరాముడిని మొదటిసారిగా కలుసుకుని శరణు కోరింది ఇక్కడేననీ, రావణ వధ అనంతరం విభీషణుని పట్టాభిషేకం జరిపించిన ప్రదేశం ఇదేనని విశ్వసిస్తారు. 1964లో ధనుష్కోటిలో ఏర్పడిన ప్రళయంలో అన్నీ తుడుచుకుపెట్టుకుపోగా.. ఈ ఆలయం చెక్కు చెదరకుండా నిలిచింది. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, విభీషణుడు కూడా కొలువుదీరి ఉన్నారు.అనంతరం మోదీ రామసేతు నిర్మాణం మొదలైన అరిచల్మునైని కూడా సందర్శించారు.

నేడు మోదీ సందర్శించిన రామేశ్వరం ప్రాంతానికి రామాయణంలో ప్రత్యేక స్థానం ఉంది. మహాజ్ఞాని అయిన రావణుని చంపిన కారణంగా తనకు అంటిన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకునేందుకు రామేశ్వరంలోని సముద్ర తీరాన ఇసుకతో రాముడు.. ఒక శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడు. అందుకే ఈ ఆలయానికి రామనాథస్వామి ఆలయంగా పేరు వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి.


నేడు ప్రధాని సందర్శించిన మరో ప్రదేశం.. అగ్ని తీర్థం. రావణ వధ అనంతరం ఇక్కడే రాముడి కోరిక మేరకు సీతాదేవి తన పాతివ్రత్యం నిరూపించుకునేందుకు అగ్నిప్రవేశం చేసిందని, ఆమె దీక్షకు భయపడిన అగ్ని దేవుడు ప్రాణభయంతో.. సముద్రంలో మునిగాడని పురాణ కథనం. అందుకే దీన్ని ‘అగ్నితీర్థం’ అంటారు. ఈ అగ్నితీర్థం సహా మరో 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్యకు తీసుకెళ్తున్నారు.

కాగా నిన్న ప్రధాని దర్శించుకున్న తమిళనాడులోని తిరుచిరాపల్లి రంగనాథస్వామి ఆలయ పూజారులు అయోధ్యలోని రామమందిరానికి తీసుకెళ్లేందుకు 12వ శతాబ్దపు ఇతిహాసం ‘కంబరామాయణం’ ప్రతిని అందజేశారు.

PM Modi, Ram Mandir, visit, temples, Ayodhya, Consecration, Ram Mandir,

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×