అసోంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వల్ప ఉద్రిక్తత నడుమ సాగిన యాత్ర.. నేడు ప్రశాంతంగా సాగుతోంది. కాంగ్రెస్ యాత్ర సాగుతుండగా ఆదివారం కొందరు బీజేపీ కార్యకర్తలు ఎదురుపడి.. పరస్పర నినాదాలు చేశారు. రెండు సార్లు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం ఎదురుపడ్డారు. హైటెన్షన్ నెలకొనడంతో రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. రాహుల్‌ను సురక్షితంగా బస్సు ఎక్కించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. న్యాయ్ యాత్ర చేస్తున్న తమ నేతను బీజేపీ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామని.. మోడీ సర్కారు వచ్చాక.. ప్రజల హక్కులను కాలరాస్తుందంటూ నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ.. రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు.
రాహుల్ గాంధీ బస్సుయాత్రతో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ కార్యకర్తలు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.