Big Stories

PM Modi Comments on Nehru: నెహ్రూ రిజర్వేషన్లకు వ్యతిరేకం.. మోదీ సంచలన వ్యాఖ్యలు..

Pm modi speech today

Pm Modi comments on Nehru in Rajya Sabha:

- Advertisement -

కాంగ్రెస్ పార్టీపైనా, భారత్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపైనా ప్రస్తుత పీఎం మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాజ్యసభలో మాట్లాడిన మోదీ.. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయన్నారు. గిరిజన రాష్ట్రపతిని ఆ పార్టీ వ్యతిరేకించిందని మండిపడ్డారు. అలాగే ఆమెను అవమానించిందని విమర్శించారు.

- Advertisement -

తాను స్వతంత్ర భారతంలో పుట్టానని.. తన ఆలోచనలు స్వతంత్రంగా ఉంటాయని స్పష్టంచేశారు. తాను బానిసత్వానికి వ్యతిరేకమని తేల్చిచెప్పారు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పాఠాలు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. హస్తం పార్టీ విశ్వనీయతను కోల్పోయిందన్నారు. యూపీఏ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని విమర్శించారు.

భారత్ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపించారు. రిజర్వేషన్లు దేశాన్ని అస్థిరపరుస్తాయని నెహ్రూ వాదించారని తెలిపారు.

ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూకాశ్మీర్ దళితులకు న్యాయం చేశామని మోదీ స్పష్టంచేశారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్..ఒక స్లోగన్ కాదు.. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని అన్నారు.

కాంగ్రెస్ హయాంకు తమ పాలనలో చాలా తేడా ఉందని మోదీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రగతిని కంపేర్ చేశారు. పీఎస్ యూలు మంచి పనితీరు ప్రదర్శిస్తున్నాయన్నారు. 2014లో 234 పీఎస్ యూలు ఉంటే నేడు అవి 254 చేరాయని తెలిపారు. HAL కూడా రికార్డుస్థాయి లాభాలు సంపాదిస్తోందన్నారు. బీఎస్ఈ పీఎస్ యు ఇండెక్స్ ఏడాదిలో రెట్టింపైందని ప్రకటించారు.

యూపీఏ హయాంలో పదేళ్లు గుజరాత్ ను టార్గెట్ చేశారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి కేంద్రమంత్రులను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. దేశం అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయని తెలిపారు.

నెహ్రూ కాలం నుంచి యూపీఏ పాలన వరకు ఏం జరిగిందో వివరిస్తూ మోదీ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఇప్పటి వరకూ విజయవంతంగా లాంచ్ చేయలేకపోయిందని సెటైర్లు వేశారు.

ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై మోదీ స్పందించారు. కొందరు కావాలనే దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. మా రాష్ట్రం.. మా ట్యాక్స్ అంటున్నారని ఇదే వితండవాదమన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News