E-Paper
Advertisement

Women Reservation Bill : మరోసారి లోక్‌సభకు మహిళా రిజర్వేషన్ బిల్లు!

Women Reservation Bill : మరోసారి లోక్‌సభకు మహిళా రిజర్వేషన్ బిల్లు!
Advertisement

మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న సాయంత్రం పార్లమెంటులో వీగిపోయిన విషయం తెలిసిందే.కేంద్రంలోని మోడీ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. స్పీకర్ ఓం బిర్లా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద రోజంతా చర్చకు అనుమతించారు. ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష సభ్యులను కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు మహిళా రిజర్వేజన్ బిల్లును వ్యతిరేకించారు. అందుకు వారు తమ దగ్గర సమాధానం ఉందని చెబుతున్నారు. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఉంటే తాము మద్దతు ఇచ్చేవారని లోక్‌సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ చెప్పారు.

డీలిమిటేషన్ వల్లే..

కేంద్రం మహిళా రిజర్వేషన్ మాటున డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడమే ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనగణన పూర్తయ్యాక డీమిలిటేషన్ తేస్తామని చెప్పిన కేంద్రం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆగమేఘాల మీద తేవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. దీనిలో రాజీకయ కుట్రకోణం దాగుందని వారు ఆరోపిస్తున్నారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు మాటున తెచ్చిన డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవాలనే మద్దతు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఇటువంటి బిల్లులు తెచ్చే సమయంలో కేంద్రం అఖిలపక్షం వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆల్ పార్టీ మీటింగులో డీలిమిటేషన్ మీద పూర్తిగా చర్చించాక సభ్యులు, సీనియర్ల అభిప్రాయాలు తెలుసుకున్నాకే మరోసారి పార్లమెంట్ ఆమోదం కోసం తీసుకురావాలని వారు సూచిస్తున్నారు.

వర్షాకాలంలో బిల్లు..

Advertisement

ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపకపోవడంతో స్పీకర్ ఓం బిర్లాను సభను నేటికి వాయిదా వేశారు. నేడు మరోసారి నిన్న పార్లమెంటులో జరిగిన ఘటనలపై మరోసారి చర్చా కార్యక్రమం ఉంటుందని తెలుస్తున్నది.దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నవేళ హడావుడిగా మహిళా రిజర్వేషన్ బిల్లు, దాని మాటున డీలిమిటేషన్ బిల్లులు తేకుంటే తాము సైతం బిల్లుకు మద్దతు ఇచ్చేవారమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వాస్తవానికి 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యిందని.. కానీ, 2029లో జరిగే జమిలి ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలవుతాయని కేంద్రం ఆ బిల్లు పాస్ అయ్యాక ప్రకటించింది. ప్రస్తుతం ఎన్నికల వేళ ఈ బిల్లును ఆమోదిస్తే మహిళా ఓటర్లకు 33శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.

Painkillers: మీరు వాడే ఈ పెయిన్ కిల్లర్ మాత్రలు ఎంత ప్రమాదకరమో తెలుసా?

Advertisement

దీనిని రాష్ట్రాల ఎన్నికల్లో క్యాష్ చేసుకుందామని బీజేపీ భావించింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టి దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం మీద తిరుగుబాటుకు సిద్ధమయ్యాయి. ఇండియా కూటమితో కలిసిన పార్టీలన్నీ ముక్తకంఠంతో ఆ బిల్లుకు ఆమోదం తెలపలేదు.ఫలితంగా మిగతా రెండు బిల్లులను సైతం కేంద్ర వెనక్కితీసుకోవాల్సి వచ్చింది. అయితే, వచ్చే వర్షాకాల సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు(131 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ) చేసి తీరుతామని , మరోసారి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెటడామని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ బిల్లు కాస్త ఆమోదం పొందితే వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లు గంపగుత్తగా తమకే వస్తాయని కమలం పార్లీ ప్లాన్ చేసిందని ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. వర్షాకాల సమావేశంలో మరోసారి ఇలాగే బిల్లు తెస్తే అప్పుడు కూడా ఆమోదించేది లేదని విపక్షాలు చెబుతున్నాయి.

 

Related News

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

Big Stories

Advertisement
×