BigTV English

Modi : మెట్రోలో మోదీ జర్నీ.. ఎక్కడంటే..?

Modi : మెట్రోలో మోదీ జర్నీ.. ఎక్కడంటే..?

Modi : ప్రధాని మోదీ రూటే సెపరేటు. ఆయన సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి. సామాన్యులతో ముచ్చటించేందుకు ఆసక్తిగా ఉంటారు. తాజాగా మోదీ ఢిల్లీ మెట్రోలో సామాన్యుడిగా ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు మెట్రోలోనే వెళ్లారు.


సామాన్య ప్రయాణికుల మాదిరిగానే మెట్రో రైలులో కూర్చుని ప్రయాణించారు. కొందరు విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో మాట కలిపారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారితో దిగిన ఫొటోలను మోదీ ట్విటర్‌లో షేర్ చేశారు. బీజేపీ కూడా మోదీ మెట్రో రైలు ప్రయాణ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌ గా మారాయి.

మోదీ ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. 1922లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ చట్టం ప్రకారం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీని యూజీసీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా గుర్తించింది. 2022 నాటికి ఈ విశ్వవిద్యాలయానికి వందేళ్లు పూర్తయ్యాయి. గతేడాది మే 1న శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఏడాదిపాటు ఈ వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు ముగింపు ఉత్సవాలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×