Sikandar raza Missed faf du plessis run out: క్రికెట్ లో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. క్యాచ్ మిస్సులు, అదిరిపోయే ఫీల్డింగులు, భారీ సిక్సర్లు, చెత్త ఫీల్డింగులు అబ్బో చెప్పుకుంటూ పోతే ఎన్నో జరుగుతాయి. అయితే, తాజాగా జింబాబ్వే సీనియర్ ప్లేయర్ సికందర్ రజా చెత్త పీల్డింగ్ కారణంగా ఈజీగా రనౌట్ కావాల్సిన ఫాఫ్ డుప్లెసిస్ గ్రేట్ ఎస్కేప్ అయ్యాడు. ఈ సంఘటన ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ 2026లో జరుగగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి ఫీల్డింగ్ రా నాయనా అంటూ రియాక్ట్ అవుతున్నారు.
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ 2026 చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగానే శుక్రవారం షార్జా వారియర్స్ వర్సెస్ దుబాయ్ క్యాపిటల్స్ మధ్య 8వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో దుబాయ్ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్ రనౌట్ అయ్యే ఛాన్సును సికందర్ రజా చేజేతులా పొగొట్టాడు. ఈ మ్యాచ్ లో షార్జా వారియర్స్ బౌలర్ సికందర్ రజా 6వ ఓవర్ వేశాడు. ఇందులో మూడో బంతిని బ్యాటర్ మ్యాక్స్ హోల్డెన్ కవర్ దిశగా ఆడాడు. ఈ తరుణంలోనే బౌలర్ ఎండ్ వైపు ఉన్న డు ప్లెసిస్ క్రీజు వదిలి ముందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని బౌలర్ సికందర్ రజా గమనించలేకపోయాడు.
ఆలస్యంగా డుప్లెసిస్ ను చూసిన సికందర్ రజా రనౌట్ చేయడంలో తడబడ్డాడు. ఈ క్రమంలో బంతిని రెండు సార్లు మిస్ చేశాడు. చివరకు బంతితో వికెట్లను గిరాటేసినా, అప్పటికే డుప్లెసిస్ క్రీజులోనే వచ్చేశాడు. దీంతో రనౌట్ కాకుండా ఫాఫ్ డుప్లెసిస్ ఎస్కేప్ అయ్యాడు. దీంతో అయ్యే రనౌట్ మిస్ అయిందని సికందర్ రజా ఓవరాక్షన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నమెంటో మొత్తం ఫిక్సింగే జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. డుప్లెసిస్ ను కావాలనే రనౌట్ చేయలేదని, దుబాయ్ క్యాపిటల్స్ ఇచ్చిన డబ్బులకు అమ్ముడుపోయాడంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ 126 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని 3 వికెట్లు నష్టపోయి, షార్జా వారియర్స్ ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
PATHETIC AND SHAMEFUL!
The @ICC needs to investigate the ILT20. Never expected a professional like Sikandar Raza to make such a basic error. pic.twitter.com/gdLCzge96P
— Abhiyank Choudhary (@AbhiChoudhary_7) November 27, 2026