E-Paper
Advertisement

PM RAHAT Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల ఉచిత వైద్యం.. పీఎం రహత్ స్కీమ్ కు ఆమోదం

PM RAHAT Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల ఉచిత వైద్యం.. పీఎం రహత్ స్కీమ్ కు ఆమోదం
Advertisement

PM RAHAT Scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో సేవా తీర్థ్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టార్టప్ ఇండియా 2.0 , పీఎం రహత్ స్కీమ్, లక్‌పతి దీదీలు 6 కోట్లకు పెంచనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. పీఎం రహత్ పథకం కింద క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించనున్నారు. అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రమాద బాధితులు ప్రాణాలు కోల్పోవడం, అలాగే, బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది.

రూ.1.50 లక్షల ఉచిత వైద్యం

పీఎం రహత్ పథకం కింద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. ఆర్థికపరమైన కారణాల వల్ల రోడ్డు యాక్సిడెంట్ బాధితులు గోల్డెన్ హవర్‌లో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఇబ్బందులు నివారించేందుకు, బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను నిలబెట్టడమే పీఎం రహత్ పథకాన్ని తీసుకొచ్చారు. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో పీఎం రహత్ స్కీమ్ తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Advertisement

ప్రధాని కొత్త కార్యాలయం సేవా తీర్థ్ ను ప్రధాని మోదీ నిన్న ప్రారంభించారు. అనంతరం తన కొత్త కార్యాలయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. PM RAHAT పథకాన్ని ఆమోదించారు. అలాగే రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

6 కోట్ల లక్ పతి దీదీలు

మార్చి 2029 నాటికి 6 కోట్ల లక్ పతి దీదీలను సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. భారతదేశం వ్యవసాయ విలువను బలోపేతం చేసేందుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రెండు లక్షల కోట్ల రూపాయలకు రెట్టింపు చేశారు. దేశీయ ఆవిష్కరణ వ్యవస్థను, ముఖ్యంగా సాంకేతికత, స్టార్టప్ ఆలోచనలను, అధునాతన తయారీ, పురోగతికి సంబంధించిన ఆవిష్కరణల కోసం 10 వేల కోట్ల రూపాయల కార్పస్‌తో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కి ప్రధాని ఆమోదం తెలిపారు.

Advertisement

Also Read: రైతుల ఖాతాల్లో రూ.6 వేలు, ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. కేంద్ర ప్రభుత్వ టాప్ 6 సంక్షేమ పథకాలివే

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×