BigTV English

Cervical Cancer Vaccine : గుడ్ న్యూస్.. ఈ వయసు బాలికలకు సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫ్రీ..

Cervical Cancer Vaccine : గుడ్ న్యూస్.. ఈ వయసు బాలికలకు సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఫ్రీ..
Cervical Cancer Vaccine news

Cervical Cancer Vaccine news(Telugu breaking news):

గర్భాశయ క్యాన్సర్ నివారణకు 9 నుంచి 18 సంవత్సరాల లోపు బాలికలకు.. ఉచితంగా సర్వికల్ వ్యాక్సిన్ లు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ప్రకటన చేశారు. 9-18 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ ప్రకటనను స్వాగతిస్తూ.. పబ్లిక్ హెల్త్ ఎక్స్ పర్ట్ డా. డీ.కే గుప్తా X వేదికగా ట్వీట్ చేశారు. 9-14 సంవత్సరాల బాలికలకు ఫ్రీ సర్వికల్ వ్యాక్సిన్ ను ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని సర్వైకల్ వ్యాక్సిన్లు.. 16-18 HPV రకాల నుంచి రక్షిస్తాయని అన్నారు. HPV టీకాలు 70 శాతం గర్భాశయ క్యాన్సర్ ను, 80 శాతం ఆసన క్యాన్సర్ ను, 60 శాతం యోని క్యాన్సర్ ను, 40 శాతం వల్వార్ క్యాన్సర్ ను నిరోధిస్తాయని ఆయన తెలిపారు. అలాగే HPV పాజిటివ్ ఓరోఫారింజియల్ క్యాన్సర్లను నివారించడంలో 90 శాతం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని చూపుతాయని అంచనా వేసినట్లు చెప్పారు. అలాగే ఇవి జననేంద్రియ మొటిమలను కూడా నివారిస్తాయన్నారు.

కాగా.. పుణె మునిసిపల్ కార్పొరేషన్.. 9-14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం టీకాలు వేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. బాలికలకు క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ సెర్వవాక్ వ్యాక్సిన్ షాట్ లు ఇవ్వనున్నట్లు తెలిపింది. స్వదేశీ HPV వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×