BigTV English

#90s: ఒక చిన్న సిరీస్ తెచ్చిపెట్టిన రెండు అద్భుత అవకాశాలు

#90s: ఒక చిన్న సిరీస్ తెచ్చిపెట్టిన రెండు అద్భుత అవకాశాలు
latest news in tollywood

#90s Web Series (latest news in Tollywood):

ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. తమ టాలెంట్ ఏంటో ఆ ఒక్క అవకాశంతోనే నిరూపించుకోవాలని ఎంతగానో పరితపిస్తుంటారు. అలాంటి ఛాన్స్ అందుకున్న ఎంతోమంది ఇప్పటికీ మంచి స్థాయిలో ఉంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.


అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా అవకాశాలు దక్కించుకోవటం అంత సులభమైన పని కాదు. అందువల్ల సినిమాపై ఎంతో ఆసక్తి ఉన్నవారు.. ఎలా అయినా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలనే లక్ష్యంతో వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ వంటివి తీసి ఛాన్సులు కొట్టేస్తున్నారు. అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వారు ఉన్నారు. ఈ కోవలోకి తాజాగా ఓ యంగ్ దర్శకుడు వచ్చి చేరాడు.

ఇటీవల ఒక చిన్న సిరీస్‌గా వచ్చి.. ఎనలేని ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది ‘90s మిడిల్ క్లాస్ ఫ్యామిలీ’. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌కి మంచి ఆదరణ లభించింది. సాధారణంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే సంఘటనలను అద్భుతంగా, మనస్సుని హత్తుకునే విధంగా దర్శకుడు ఆదిత్య హాసన్ రూపొందించాడు. ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో ఈ యంగ్ దర్శకుడి లైఫ్‌నే మార్చేసింది.


ప్రస్తుతం ఆదిత్య హాసన్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో హీరో నితిన్‌తో ఓ సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. ఇక నితిన్ కూడా చాలా కాలం నుంచి భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందువల్ల ఇలాంటి కొత్త దర్శకులతో నితిన్ మూవీ చేస్తే హిట్ కొట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ఇక నితిన్ సినిమాతో పాటు ఆదిత్యకు మరో ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఆదిత్య హాసన్‌‌ను ఒక ప్రాజెక్ట్ కోసం లాక్ చేసుకున్నట్లు సమాచారం. దీని బట్టి చూస్తే.. ఒక్క సిరీస్‌తో ఆదిత్య హాసన్ లైఫే మారిపోయిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×