Big Stories

Amit Shah on POK: భారత్ లో పీవోకే భాగమే.. దానిని మేం చేజిక్కించుకుంటాం: అమిత్ షా!

Amit Shah Says POK is a Part of India: భారత్ లో పీవోకే భాగమే అని, మేం దానిని చేజిక్కించుకుంటామని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని సేరంపోరే నియోజకవర్గంలో బుధవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న షా ప్రసంగించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నిరసనలు ప్రస్తావిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత సమస్యాత్మక కశ్మీర్ లో శాంతి నెలకొందని అన్నారు. ఇప్పుడు కశ్మీర్ ఆజాదీ నినాదాలు, నిరసనలతో ప్రతిధ్వనిస్తుందని తెలిపారు. 2019లో ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ లో శాంతి పునరుద్దరించిందని పేర్కొన్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిరసలు జరుగుతున్నాయని అన్నారు.

- Advertisement -

ఇంతకు ముందు కశ్మీర్ లో ఆజాదీ నినాదాలు వినిపించగా, ఇప్పుడు పీఓకేలో కూడా వినిపిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం అక్కడ రాళ్లు రువ్వుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా చొరబాటు దారులు కావాలో..లేక శరణార్థులు కావాలో పశ్చిమ బెంగాల్ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. జిహాద్ కు ఓటు వేయాలా లేదా వికాస్ కు ఓటు వేయాలా అనేది నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇటీవల పీఓకేపై కాంగ్రెస్ నేత మణిశంకర్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందించారు. మణిశంకర్ వంటి కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయని..అందుకే పీఓకేను తీసుకోవద్దని చెప్పారు. కానీ నేను పీఓకే భారత్ లో భాగమే అని చెబుతున్నాను. దానిని తప్పకుండా భారత్ తిరిగి తీసుకుంటుందని తెలిపారు.

Also Read: మనీలాండరింగ్ కేసు.. జార్ఖండ్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అవినీతి నేతలు ఉన్న ఇండియా కూటమికి, నిజాయితి కలిగిన నరేంద్రమోదీకి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. మోదీ సీఎంగా, ప్రధానిగా పనిచేసినా ఒక్కసారి కూడా అవినీతి ఆరోపణ రాలేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఏఏను వ్యతిరేకించి తన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడం కోసం, చొరబాటు దారులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారని అమిత్ షా ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News