E-Paper
Advertisement

Mathew Thomas : ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం.. కారు ప్రమాదంలో

Mathew Thomas : ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం.. కారు ప్రమాదంలో
Advertisement

Mathew Thomas Parents Car Accident: మలయాళ నటుడు మాథ్యూ థామస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న జీప్ ప్రమాదానికి గురైంది. ఈ దాడిలో మాథ్యూ దగ్గరి బంధువు అయిన బీనా డేనియల్ మృతి చెందగా.. అతని తల్లిదండ్రులు గాయాలతో బయటపడ్డారు. బుధవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తమ బంధువు మరణానంతర కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు.

శస్తాముగల్‌లోని జాతీయ రహదారిపై వస్తుండగా.. నిర్మాణంలో ఉన్న కాలువ గుంతలో జీపు బోల్తా పడింది. మాథ్యూ సోదరుడు జాన్ వాహనం నడుపుతున్నాడు. బీనా భర్త సాజు, మాథ్యూ తల్లిదండ్రులు బిజు, సుసన్‌లకు కూడా గాయాలయ్యాయి. వారిని ఎర్నాకులం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రిలో తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ విషయం తెలియడంతో మాథ్యూ థామస్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Also Read: Love Me Trailer: ఆమెను ఎవరు రెండుసార్లు చూసింది లేదు.. భయపెడుతున్న లవ్ మీ ట్రైలర్

మాథ్యూ థామస్ బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. లియోలో విజయ్ కొడుకుగా నటించి మెప్పించిన మాథ్యూ థామస్ నైమర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక ఇది కాకుండా మాళవిక మోహనన్ నటించిన క్రిస్టీ చిత్రంలో కూడా నటించాడు. ఇక ప్రేమలు చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా హిట్ తరువాత మాథ్యూ థామస్ కు వరుస సినిమాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అతని చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×