Kolkata Doctor Murder news(Telugu breaking news today): పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్ జి కార్ మెడికల్ కాలేజి అనే ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ మహిళా డాక్టర్ పై వారం రోజుల క్రితం జరిగిన హత్యాచారం కేసు ఇప్పుడు రాజకీయ తుపానుగా రూపం మార్చుకుంది. మహిళా డాక్టర్ పై పైశాచికంగా అత్యాచారం చేసి.. ఆమెను హత్య చేసిన ఘటనకు దేశ నలుమూలల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా వైద్యులందరూ ఓపిడి సేవలు నిలిపివేశారు. వైద్యుల జాతీయ సంఘం అయిన ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) దేశ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
హత్యాచార కేసులో కోల్ కతా పోలీసులు నిర్లక్ష్యంగా విచారణ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ మొదలుపెట్టింది. ఇప్పటివరకు సిబిఐ అధికారులు చనిపోయిన మహిళా డాక్టర్ తో కలిసి పనిచేసిన ముగ్గురు డాక్టర్లను ప్రశ్నించింది. ఘటన జరిగిన రాత్రి మృతురాలితో ఈ ముగ్గురు డాక్టర్లు డిన్నర్ చేశారు. ఆ తరువాత ఆమెను చివరిసారిగా చూశారని విచారణ జరుగుతోంది. మొత్తం పది మందిని విచారణకు హాజరుకావాల్సిందిగా సిబిఐ నోటీసులు జారీచేసింది. వీరిలో మెడికల్ కాలేజీ ప్రిన్స్ పాల్ డాక్టర్ సందీప్ ఘోష్ కూడా ఉండడం గమనార్హం. అయితే సందీప్ ఘోష్ ను మొత్తం 12 గంటలపాటు సిబిఐ అధికారులు విచారణ చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు సంజయ్ రాయ్ అనే పోలీస్ వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడే డాక్టర్ ను హత్య చేశాడని ఆరోపణలున్నాయి. సంజయ్ రాయ్ ఇంతకుముందు తన గర్భవతి భార్యను కొట్టాడని, కాలేజీలో మరో జూనియర్ డాక్టర్ ను వేధించాడనే కేసులున్నాయి. అయితే అర్ధరాత్రి సంజయ్ రాయ్ ఎందుకు ఆస్పత్రిలో ఉన్నాడు? అనే ప్రశ్నకు సమాధానం లభించడం లేదు.
మరోవైపు ఈ కేసులో రాజకీయ కోణం కూడా ఉన్నట్లు అనుమానాలున్నాయి. మహిళా డాక్టర్ చాలా కృూరంగా హింసించి చంపిన వారిలో ఒకరు టిఎసీ ఎమ్మెల్యే మేనల్లుడని బిజేపీ ఆరోపణలు చేసింది. అందుకే హత్య జరిగిన వెంటనే పోలీసులు.. ఈ కేసుని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిందని కోల్ కతా బిజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో అసలు దోషి ఎవరనేది ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు కచ్చితంగా తెలుసనని అన్నారు.
కోల్ కతా కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితులను కాపాడుతోందని ఆరోపణలు చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు నాశనం చేయడానికి కొంతమంది రౌడీలు నిరసనకారుల వేషం లో వచ్చి ఆస్పత్రిలోని ఘటనాస్థలాన్ని నాశనం చేశారని. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల సహకారంతోనే నడిచిందని అన్నారు. నిరసనకారులు వేషంలో ఉన్న రౌడీలు రాళ్లు, రాడ్లు తీసుకొని ప్రభుత్వఆస్పత్రి వద్ద హింసను ప్రేరేపించారని తెలిపారు. ఘటనా స్థలం పూర్తిగా నాశనం చేశారని.. ఇప్పుడా ప్రదేశంలో రెనోవేషన్ పనులు కూడా జరుగుతుండడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. మరోవైపు కోల్ కతా పోలీసులు ఈ కేసుని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని.. లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. అలాగే తాము ఇది ఆత్మ హత్య కేసు అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినోత్సవం రోజున తన ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా పరోక్షంగా ఈ కేసు గురించి ప్రస్తావించారు.
ఈ కేసులో హై కోర్టు కోల్ కతా పోలీసులు సరిగా విచారణ చేయడం లేదని చెబుతూ.. సిబిఐకి ఈ కేసుని బదిలీ చేసింది. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ .. మహిళా డాక్టర్ హత్య కేసులో దోషికి ఉరిశిక్ష విధించాలని ర్యాలీ నిర్వహించారు.
ఈ కేసులో పోస్ట్ మార్టెమ్ రిపోర్ట ప్రకారం.. మహిళా డాక్టర్ మరణం గొంతు నులిమి చంపడంతో జరిగింది. ఆమె కళ్లజోడుని బలంగా కొట్టడంతో ఆమె కళ్లలో నుంచి రక్తం వచ్చిందని, ఆమె శరీరమంతా కత్తులతో చేసిన గాయలున్నాయని, ఆమె ప్రైవేట్ భాగాల నుంచి కూడా రక్తస్రావమైందని ఉంది. చాలా కృూరంగా ఆమె రెండు కాళ్లు చీల్చి అత్యాచరం చేశారని రిపోర్టులో ఉంది. అయితే రిపోర్టు ప్రకారం.. ఆమె శరీరం నుంచి 150 గ్రాములు వీర్యం ఉందని తేలడంతో ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలున్నాయి. అయినా ఇప్పటివరకు ఈ కేసులో దోషుల గురించి ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.
Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?