Hyderabad: హైదరాబాద్‌లోని నారపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేడిపల్లికి చెందిన జాదవ్ సాయితేజ ఇటీవల సిధ్ధార్ధ్ ఇంజనీరింగ్ కాలేజిలో బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాడు. సీనియర్స్ ర్యాగింగ్ అని సాయితేజను బార్‌కి తీసుకొని వెళ్లారు. మద్యం తాగాలని సాయితేజను ఒత్తిడి చేశారు. ఆ రాత్రి మద్యం బిల్లు రూ.10వేలు అయ్యింది. ఈ బిల్లును చెల్లించమని సాయితేజను ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయితేజ.. మధు బాయ్స్ హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలికి చేరుకున్నారు. కాలేజి యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.