Avika Gor: అవికా గోర్ (Avika Gor)అంటే తెలుగు ప్రేక్షకులకు ఈమె గుర్తుకు రాకపోవచ్చు కానీ చిన్నారి పెళ్లికూతురు (Chinnari Pelli kuthuru) అంటే మాత్రం టక్కున అందరికీ అవికా గోర్ గుర్తుకు వస్తారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగారు. “ఉయ్యాల జంపాల”సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవికా అనంతరం తెలుగులో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈమె బాలీవుడ్ సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా మారి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్న అవికా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు గత కొంతకాలంగా ఈమె సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వాని(Milind Chandwani)తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. 2020 వ సంవత్సరం నుంచి ఈ జంట ప్రేమలో ఉండటమే కాకుండా నిత్యం తన ప్రియుడుతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసేవారు. అయితే తన ప్రియుడు మిలింద్ తో కలిసి అవికా ఈ ఏడాది జూన్ నెలలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం (Engagment)జరుపుకున్నారు. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
సెప్టెంబర్ 30న వివాహం…
తాజాగా వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖాయమైందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం అవికా
మిలింద్ సెప్టెంబర్ 30వ తేదీ అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారని ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తన వివాహం ఎక్కడ జరుగుతుంది? ఏంటీ ? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.. ఇలా చిన్నారి పెళ్ళికూతురు ఇప్పుడు నిజంగానే పెళ్ళికూతురుగా మారబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ఇకపోతే ఈమె పెళ్లికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది..
చిన్నారి పెళ్లికూతురుగా గుర్తింపు…
బుల్లితెర నటిగా పలు హిందీ సీరియల్స్ లో కూడా నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న అవికా తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో మాత్రమే కనిపించే సందడి చేశారు. అనంతరం ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, లక్ష్మీ రావే మాఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3 వంటి సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఈమె తెలుగులో “షణ్ముఖ” అనే సినిమాలో నటిస్తున్నారు. ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.
Also Read: Film Chamber: థియేటర్స్‌లో టికెట్ మోసాలు.. 50 శాతం జరిమానా అంటూ బాంబ్ పేల్చిన ఫిల్మ్ ఛాంబర్