BigTV English

Ola Electric Roadster: ఓలా నుంచి రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్​ బైక్..​ వేరియంట్లు, ఫీచర్లు, ధరలు ఫుల్ డీటెయిల్స్..!

Ola Electric Roadster: ఓలా నుంచి రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్​ బైక్..​ వేరియంట్లు, ఫీచర్లు, ధరలు ఫుల్ డీటెయిల్స్..!

Ola Electric Roadster: ప్రముఖ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌కి దేశీయ మార్కెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ కొత్త కొత్త స్కూటర్‌లను తీసుకొస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. అతి తక్కువ సమయంలోనే ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాప్ ‌ప్లేస్‌ని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ విభాగంలో ఓ సరికొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఇటీవలే ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ బైక్ సిరీస్‌ను మార్కెట్‌లో రిలీజ్ అయింది. ఇది మొత్తం మూడు వేరియంట్లలో వచ్చింది. అవి ఓలా రోడ్​‌స్టర్ ఎక్స్, ఓలా రోడ్​‌స్టర్, ఓలా రోడ్​స్టర్ ప్రో. ఇప్పుడు ఈ బైక్‌కు సంబంధించిన వేరియంట్లు, వాటి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఓలా రోడ్‌స్టర్ ఎక్స్

ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ అనేది ఎంట్రీ లెవెల్ వేరియంట్. ఇందులో మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లు ఉన్నాయి. అవి 2.5 కిలోవాట్, 3.5 కిలోవాట్, 4.5 కిలోవాట్. వీటిలో


2.5 kWh ధర రూ.74,999గా
3.5 kWh ధర రూ.84,999గా
4.5 kWh ధర రూ. 99,999గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో టాప్ 4.5 కిలోవాట్ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌పై 200 కి.మీ మైలేజీ అందిస్తుంది. అదే సమయంలో గరిష్టంగా గంటకు 124 కి.మీ పరుగులు పెడుతుందని కంపెనీ తెలిపింది. ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. దీంతోపాటు మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఓలా రోడ్‌స్టర్

Also Read: ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. అతి తక్కువ ధరకే!

ఓలా రోడ్‌స్టర్ అనేది మిడ్ రేంజ్ వేరియంట్. ఇందులో కూడా మూడు బ్యాటర్ ప్యాక్ ఆప్షన్‌లు ఉన్నాయి. అందులో

3.5 kWh ధర రూ. 1,04,999గా
4.5 kWh ధర రూ.1,19,999గా
6 kWh ధర రూ.1,39,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ మిడ్ రేంజ్ రోడ్‌స్టర్ సింగిల్ ఛార్జింగ్‌తో 248 కి.మీ మైలేజీ అందిస్తుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 126 కి.మీగా కంపెనీ పేర్కొంది. దీని టాప్ 6కిలోవాట్ల ఆప్షన్ గల బ్యాటరీ ప్యాక్ 2.6 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ స్పీడ్‌ను అందుకుంటుంది. ఇకపోతే ఈ మిడ్ రేంజ్ బైక్‌ డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. ఇది డబుల్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఇందులో మరెన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఓలా రోడ్‌స్టర్ ప్రో

ఓలా రోడ్‌స్టర్ ప్రో అనేది టాప్ అండ్ హై వేరియంట్. ఇది ఈ సిరీస్‌లో అత్యంత భారీ ధర కలిగిన వేరియంట్‌గా ఉంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లలో వస్తుంది. అందులో

8 kWh ధర రూ.1,99,999
16 kWh ధర రూ.2,49,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఇందులో 16 kWh బ్యాటరీ సింగిల్ ఛార్జింగ్‌పై 579 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో వస్తుంది. యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్కులు కలిగి ఉంది. నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అందులో హైపర్, స్పోర్ట్, నార్మాల్, ఎకో అనే మోడ్‌లు ఉన్నాయి. ఇందులో రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ వేరియంట్ల డెలివరీలు వచ్చే ఏడాది 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. రోడ్‌స్టర్ ప్రో డెలివరీలు 2025 దీపావళి తరువాత జరుగుతాయని అంటున్నారు.

Related News

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Big Stories

×