BigTV English

Harishrao: హరీష్‌రావు మాట నిలబెట్టుకుంటారా? రుణమాఫీపై నాడు అలా.. నేడు ఇలా.. సాకులతో కాలక్షేపం

Harishrao: హరీష్‌రావు మాట నిలబెట్టుకుంటారా? రుణమాఫీపై నాడు అలా.. నేడు ఇలా.. సాకులతో కాలక్షేపం

Harish rao latest news(Political news in telangana): బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఝలక్ ఇచ్చారా? రుణమాఫీ అసాధ్యమని బీఆర్ఎస్ భావించిందా? ఈ విషయంలో కారు పార్టీ డిఫెన్స్‌లో పడిపోయిందా? హరీష్‌రావు అడ్డంగా దొరికిపోయారా? రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చిన ఆయన, ఎందుకు తప్పించుకుంటున్నారు? దీన్ని డైవర్ట్ చేసేందుకు కుంటిసాకులు వెతుకుతున్నారా?ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజలను వెంటాడు తున్నాయి.


తెలంగాణలో రాజకీయాలు అభివృద్ధి, హామీల చుట్టూ తిరుగుతోంది. రైతుల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రెండేళ్ల కిందట వరంగల్ సభలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటన చేశారు. అన్నట్లుగానే తొలి విడత లక్ష, సెకండ్ విడత లక్షన్నర చివరిగా రెండు లక్షలు రైతులకు రుణమాఫీ చేశారు. అదీ కూడా ఆగస్టు 15లోగా చేశారు. దీనికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి. ఈ విషయంలో లబ్దిదారులు ఫుల్‌ఖుషీ.

రుణమాఫీ విషయాన్ని రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకొచ్చిన నుంచి దాన్ని రాజకీయం చేసేందుకు ప్రయ త్నించింది బీఆర్ఎస్. ఈ విషయంలో ప్రభుత్వానికి సవాల్ విసిరారు హరీష్‌రావు. ఆగస్టు 15లోగా రుణ మాఫీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సిద్ధిపేట్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని అప్పట్లో ప్రకటన చేశారు. ఒకవేళ రాజీనామా చేయకుంటే మీ రాజీనామాలు గవర్నర్‌కు ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నారా అంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు రాజీనామా నుంచి తప్పించుకునేందుకు కుంటు సాకులు వెతుకుతున్నారాయన.


ALSO READ:  కొత్త పీసీసీ అధ్యక్షుడు.. కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ చర్చ

రుణమాఫీ విషయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏడాదికి కొంత చొప్పున నిధులను రిలీజ్ చేసింది. కానీ రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో చేసి చూపించింది. ఆ రోజు అన్నమాటను హరీష్‌రావు నిలబెట్టుకోలేక రుణమాఫీకి పెడ అర్థాలు తీసే పనిలో పడ్డారన్నది కాంగ్రెస్ నేతల మాట. రుణమాఫీ అందరికీ అందలేదంటూ బీఆర్ఎస్ నేతలు కొత్త చర్చ లేవనెత్తారు.

గాంధీ కుటుంబం ఇచ్చిన మాట నెరవేర్చిందన్న సంగతిని ప్రతిపక్షం గుర్తిస్తే చాలన్నారు ముఖ్యమంత్రి. దీంతో డైలామాలో పడిపోయింది బీఆర్ఎస్. రుణమాఫీ అందనివారికి కొద్దిరోజుల్లో పడిపోతుందని, దీనికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. డీ‌టేల్స్ ఇవ్వకుండా కేవలం నోటిమాటతో హరీష్‌రావు సరిపెడుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్‌ని ఇరుకున పెట్టాలని భావించి కారు పార్టీ ఇరుకున పడింది. ఎవరు తీసిన గోతి లో వారే పడడమంటే ఇదేనేమో!

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×