BigTV English

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

సెప్టెంబర్-30 డెడ్ లైన్ లోగా ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)లోకి మారాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈమేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 2025 ఏప్రిల్-1 నుంచి జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద UPSని ఒక ఎంపికగా ప్రవేశపెట్టారు. అయితే UPSలోకి మారేందుకు సెప్టెంబర్-30 గడువు నిర్ణయించారు. ఇప్పుడు ఆ గడువు సమీపిస్తుండటంతో ఉద్యోగులు ఆ ప్రయోజనాలను అందుకోవాలంటే వెంటనే మారిపోవాలని సూచించింది. గడువు తర్వాత ఉద్యోగులెవరూ UPSలోకి మారేందుకు అవకాశం ఉండదు.


NPS లేదా UPS
గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్(OPS) ఉండేది. దాని స్థానంలో వాజ్ పేయి హయాంలో నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)ని తీసకొచ్చారు. రాష్ట్రాల్లో ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS)గా అమలులో ఉంది. దీనివల్ల గందరగోళం నెలకొంది. పాత పెన్ష్ విధానంలో వచ్చే వెసులుబాట్లు, సౌలభ్యాలు NPSలో లేవు. అందుకే ఉద్యోగులంతా దీన్ని వ్యతిరేకించారు. కానీ కేంద్రం అమలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భరించారు. ఇప్పటికీ చాలా చోట్ల పాత పెన్షన్ విధానం కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)ని తీసుకొచ్చింది. ఇది పాత పెన్షన్ విధానానికి ప్రత్యామ్నాయం అని చెప్పలేం కానీ, NPSలో లేని కొన్ని సౌకర్యాలు UPSలో ఉన్నాయని కేంద్రం చెబుతోంది. అయితే NPS నుంచి UPSకి మారాలనుకునేవారికి ఈ ఏడాది సెప్టెంబర్-30ని తుది గడువుగా నిర్ణయించింది. ఒకవేళ UPSలోకి మారిపోయినా భవిష్యత్తులో ఒకసారి NPSలోకి మారే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని వన్ టైమ్ వన్ వే స్విచ్ సౌకర్యం అంటారు. అందుకే ఆర్థిక శాఖ తమ ఉద్యోగుల్ని NPS నుంచి UPSలోకి మారాలని సూచించింది.

UPS ప్రయోజనాలు
జూలై 20 వరకు దాదాపు 31,555 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు UPSని ఎంపిక చేసుకున్నారు. వీరంతా UPS మంచి పథకం అని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం UPS కింద ‘రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ’ ప్రయోజనాన్ని పొడిగించింది. ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు మరణించిన సందర్భంలో, వైకల్యం కారణంగా అతని డిశ్చార్జ్ సందర్భంలో CCS పెన్షన్ నియమాల ద్వారా అందే ప్రయోజనాలకు అతను అర్హుడు అవుతాడు. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం NPSకి అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనాలను కూడా ప్రభుత్వం UPSకి విస్తరించడం విశేషం.


ప్రభుత్వం సూచన..
ప్రభుత్వం UPSని తీసుకొచ్చినా దీన్ని చాలామంది విశ్వసించడం లేదు. పాత పెన్షన్ స్కీమ్ కి దీన్ని ప్రత్యామ్నాయంగా భావించడం లేదు. అయితే దీనిలో ఉన్న కొన్ని సౌకర్యాలు NPS కంటే బాగుంటడంతో ఉద్యోగులు దీనివైపు ఆకర్షితులవుతున్నారు. కానీ ఈ పెన్షన్ స్కీమ్ మార్పుని ప్రభుత్వం ఉద్యోగుల చేతుల్లోనే పెట్టడంతో గందరగోళం నెలకొంది. ఉద్యోగులు తమకు తామే ఈ పెన్షన్ స్కీమ్ లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఎంపికలు లేకపోతే వారు తిరిగి NPS లోనే కొనసాగాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం తన బాధ్యతగా ఉద్యోగులను ముందస్తుగా అలర్ట్ చేస్తోంది. నెలాఖరులోగా ఉద్యోగులంతా UPS లోకి మారాలని సూచించింది.

Related News

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Air India Flight: విశాఖ – హైదరాబాద్ విమానానికి.. తృటిలో తప్పిన ప్రమాదం

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరద బీభత్సం.. కొండచరియలు విరిగి 10 మంది గల్లంతు

Kerala: కేరళలో కొత్త వైరస్.. 100 మందికి పైగా..?

Rahul Gandhi: ఎన్నికల సంఘంపై రాహుల్‌ విసుర్లు.. ఆధారాలు ఇవిగో, కీలక విషయాలు వెల్లడి

Narendra Modi: మోదీ @ 75.. ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఆ శక్తి వెనుక రహస్యాలు..

Big Stories

×