BigTV English

Female Police Officers: దేశంలో అత్యధిక మహిళా పోలీసులు ఉన్న రాష్ట్రాలు ఇవే.. ఏపీ ప్లేస్ ఎంతో తెలుసా?

Female Police Officers: దేశంలో అత్యధిక మహిళా పోలీసులు ఉన్న రాష్ట్రాలు ఇవే..  ఏపీ ప్లేస్ ఎంతో తెలుసా?

దేశంలో ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో మహిళా పోలీసులు అధికారుల సంఖ్య మరింత పెరిగింది. పురుషులకు ఏమాత్రం తీసిపోని రీతిలో లా అండ్ ఆర్డర్ పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లోనూ మహిళా పోలీసులు సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల పోలీసింగ్ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, యూనిఫామ్ ఉద్యోగాలు కోరుకునేలా ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహిస్తున్నాయి.


ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది మహిళా పోలీసులు ఉన్నారంటే?

2024లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌ లో అత్యధిక సంఖ్యలో మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. జనవరి 1, 2023 ఆ రాష్ట్రంలో 33,319 మంది మహిళా పోలీసులు ఉన్నారు.  రెండో స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రంలోనూ అత్యధిక సంఖ్యలో మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.   తమిళనాడు, బీహార్, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోనూ మహిళా పోలీసులు సంఖ్య భారీగానే ఉన్నది. బాధితులకు ఓదార్పు కలిగించడంలో పురుషులతో పోల్చితే మహిళలు ఎక్కువ చొరవ చూపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసులలో వీళ్లు వ్యవహరించే తీరు చాలా బాగుంటుందంటున్నాయి.


అత్యధిక సంఖ్యలో మహిళా పోలీసులు ఉన్న టాప్ 10 రాష్ట్రాలు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ఆధారంగా అత్యధిక మహిళా పోలీసులు ఉన్న టాప్ 10 రాష్ట్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ 18,913 మంది మహిళా పోలీసులతో టాప్ 5లో నిలిచింది.  జనవరి 1, 2023 వరకు తీసుకున్న డేటా ప్రకారం PBI ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు తెలిపింది.

1.ఉత్తర ప్రదేశ్- 33, 319

2.మహారాష్ట్ర- 32, 172

3.తమిళనాడు- 25, 334

4.బీహార్- 24, 295

5.ఆంధ్రప్రదేశ్- 18, 913

6.గుజరాత్- 14, 775

7.రాజస్థాన్- 10, 361

8.పశ్చిమ బెంగాల్- 9, 603

9.కర్ణాటక- 9, 081

10.పంజాబ్- 8, 167

దేశ రాజధాని ఢిల్లీలో మహిళా పోలీసులు సంఖ్య ఎంతో తెలుసా?

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 2023 నాటికి  ఢిల్లీ పోలీసు శాఖలో 11,930 మంది మహిళా పోలీసు అధికారులు పని చేస్తున్నారు. ఢిల్లీలో శాంతి భద్రతలను, ప్రజా భద్రతను కాపాడటానికి, మహిళలు, పిల్లలపై నేరాలను తగ్గించడానికి మహిళా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు.  ట్రాఫిక్ నియంత్రణ, పెట్రోలింగ్, కేసుల దర్యాప్తు, వేధింపులు, గృహ హింస లాంటి సున్నితమైన సమస్యల నిర్వహణలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. మహిళా పోలీసు అధికారులకు ప్రత్యేక అధికారులు ఇచ్చేందుకు అనుకూలంగా పెద్ద సంఖ్యలో మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఢిల్లీ పోలీసు డిపార్ట్ మెంట్.  గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా మహిళా పోలీసులు సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో మహిళలు పోలీసులు ఉద్యోగాలను పొందారు. తాజా లెక్కలను పరిగణిలోకి తీసుకుంటే దేశ వ్యాప్తంగా లేడీ పోలీసులు సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు అధికారులు.

Read Also: కమిషనర్‌కు బిజేపీ నుంచి ఏదో ఆఫర్ ఉంది.. ఎన్నికల సంఘంపై కేజ్రీవాల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×