BigTV English

Chandrayaan 3 : పాకిస్తాన్‌కి ఇచ్చిపడేశారు.. చంద్రబాబు, ప్రకాశ్‌రాజ్‌లపై చంద్రయాన్3 మీమ్స్..

Chandrayaan 3 : పాకిస్తాన్‌కి ఇచ్చిపడేశారు.. చంద్రబాబు, ప్రకాశ్‌రాజ్‌లపై చంద్రయాన్3 మీమ్స్..
Chandrayaan 3


Chandrayaan 3(Chandrayaan 3 updates today) : ఇండియా ఈజ్ ఆన్‌ ది మూన్.. ఇదీ ఇస్రో సగర్వ ప్రకటన. జాబిల్లి మీద కాలుమోపిన చంద్రయాన్‌ 3 సక్సెస్‌ను దేశం మొత్తం ఆస్వాదిస్తోంది. ఇస్రో సాధించిన ప్రగతిపై సోషల్ మీడియాలో భారతీయులు అభినందనలు కురిపిస్తున్నారు. రరరకాల మీమ్స్‌తో హంగామా చేస్తున్నారు. మీమ్స్‌లో కొన్ని ఫన్నీగా ఉండగా.. చాలావరకు చంద్రయాన్ విజయం గిట్టని వారికి కౌంటర్ ఇచ్చే విధంగా ఉన్నాయి. పాకిస్తాన్, ప్రకాశ్‌రాజ్‌లపై వచ్చిన మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి.

పాకిస్తాన్ జెండాపై మూన్ ఉండటానికి.. మూన్ మీద భారతదేశ జెండా ఉండటానికి చాలా తేడా ఉందంటూ.. బోత్ ఆర్ నాట్ సేమ్.. అనే బాలయ్య డైలాగ్‌తో చేసిన మీమ్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.


చంద్రయాన్ 3 సక్సెస్ వెనుక.. చంద్ర పేరు ఉంది కాబట్టి.. క్రెడిట్ అంతా తనదేనంటూ చంద్రబాబు వచ్చి చెబుతారనే మీమ్ సైతం వైరల్ చేస్తున్నారు.

ఇక, ప్రకాశ్‌రాజ్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. చంద్రయాన్ 3 పంపే ఫస్ట్ ఇమేజ్ ఇదేనంటూ ఛాయ్‌వాలా ఫోటోను ట్వీట్ చేసి మోదీ ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారారు ప్రకాశ్‌రాజ్. ఇలా చంద్రయాన్ 3 సక్సెస్ అయిందో లేదో.. అలా ప్రకాశ్‌రాజ్ మీద ఫోటోలు వదిలారు. చంద్రుడి గుంతల్లో ప్రకాశ్‌రాజ్ ఇరుక్కుపోయినట్టు.. ఇదే రోవర్ పంపిన ఫస్ట్ ఇమేజ్ అంటూ మీమ్స్ చేశారు.

అటు, చంద్రయాన్ 3పై మొదటి రోజు రిలీజ్ రికార్డ్ మా హీరోదేనని గొప్పలు చెప్పుకుంటారని మరో మీమ్ చెక్కర్లు కొడుతోంది.

మామా.. చందమామా రావే అంటూ పాడిన పాటలు ఇక నుంచి వినబడవని.. మనమే మన మామా దగ్గరకు వెళ్లిపోయామంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×