BigTV English

Prashant kishor: మద్య నిషేధంపై సంచలన ప్రకటన.. అధికారంలోకి వచ్చిన గంటలోపే!

Prashant kishor: మద్య నిషేధంపై సంచలన ప్రకటన.. అధికారంలోకి వచ్చిన గంటలోపే!

Prashant Kishor pledges to end Bihar liquor ban: ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే మద్యపాన నిషేధంపై కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన గంటల్లోపే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు.


అక్టోబర్ 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా ఆయన మద్యనిషేధంపై మాట్లాడారు. జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన గంటలోపే బీహార్‌లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తామన్నారు. దీని కోసమే రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

మద్య నిషేధం అంటూ నితీష్ కుమార్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మద్య నిషేధం పేరుతో ఇంటింటికి మద్యంను అక్రమ పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ విధానంతో అటు రాష్ట్రానికి రూ.20వే కోట్ల ఎక్సైజ్ సుంకం రాబడి రాకుండా పోయిందన్నారు.


మద్య నిషేధం పేరుతో కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులే లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. సమర్థ రాజకీయాలే నమ్ముతానని, మద్య నిషేధంపై మాట్లాడేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వెల్లడించారు.

బీహార్‌లో 2016లో మద్యం వినియోగం, విక్రయాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానంతో పూర్తిగా మద్య నిషేధం విధించింది. అయితే అప్పటినుంచి కల్తీ మద్యం విక్రయాల దందా కొనసాగుతోంది. దీంతో కల్తీ మద్యం తాగి చాలామంది చనిపోయారు. ఈ తరుణంలో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం మద్య నిషేధంపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

అంతకుముందు బీహార్‌ అభివృద్దిపై మాట్లాడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి సూచీల్లో వెనకబడి ఉందని తేజస్వీ చేసిన వ్యాఖ్యలను దుయ్యబెట్టారు. ఆయన కేవలం మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు అయినందువల్లే రాజకీయ నాయకుడు అయ్యాడని ఆరోపించారు.

Also Read: తీవ్ర విషాదం.. కుప్పకూలిన పెద్ద భవనం.. ఎనిమిది మంది మృతి!

గతంలోనూ ప్రశాంత్ కిషోర్ ‘వక్ఫ్ సవరణ బిల్లు 2024పై మాట్లాడారు. మా లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుంటే ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందన్నారు. అలాగే నితీష్ కుమార్ పై కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన మహాకూటమిలోకి వస్తారని, ముస్లింలపై మాట్లాడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలంతా గమనిస్తూనే ఉంటారన్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×