BigTV English

UPSC New Chairperson: యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐఏఎస్ ప్రీతి‌సుదాన్

UPSC New Chairperson: యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐఏఎస్ ప్రీతి‌సుదాన్

UPSC New Chairperson(Telugu news updates): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌కు కొత్త ఛైరపర్సన్‌ వచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి ప్రీతి సుదాన్‌కు ఈ బాధ్యతలను కేంద్రప్రభుత్వం అప్పగించింది.


1983 ఏపీ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారామె. ప్రస్తుతం యూపీఎస్సీ సభ్యురాలిగా పని చేస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. ఇటీవల యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్‌సోనీ రాజీనామా చేశారు. 2029 వరకు ఆయనకు పదవీకాలం ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు.

కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి అయిన ప్రీతిసుదాన్, రెండేళ్ల కిందట యూపీఎస్సీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆగష్టు ఒకటిన ఛైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ విషయాన్ని యూపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.


ALSO READ: కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టం తీసుకొస్తాం’.. ఢిల్లీ మంత్రి ఆతిషి

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిగా ప్రీతి సుదాన్ మూడేళ్లపాటు పని చేశారు. నాలుగేళ్ల కిందట ఆమె పదవీకాలం ముగిసింది. ప్రభుత్వ పరిపాలనలో సుమారు 37 ఏళ్ల అనుభవం ఆమెకు ఉంది. రక్షణ మంత్రిత్వశాఖ, మహిళా, శిశు అభివృద్ధి శాఖలోనూ పని చేశారు. ఏపీలో పలు విభాగాల్లోనూ బాధ్యతలను నిర్వహించారు.  గతంలో ప్రపంచ బ్యాంకుకు సలహాదారుగా పని చేశారు.

Tags

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×