BigTV English

Delhi Coaching Centre| ‘కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టం తీసుకొస్తాం’.. ఢిల్లీ మంత్రి ఆతిషి

Delhi Coaching Centre| ‘కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టం తీసుకొస్తాం’.. ఢిల్లీ మంత్రి ఆతిషి

Delhi govt on coaching Centres(Today latest news telugu): ఢిల్లీలోని యుపిఎస్సీ కోచింగ్ సెంటర్ లో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన తరువాత ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు కొత్త చట్టం తీసుకు రాబోతున్నట్లు ఢిల్లీ మంత్రి ఆతిషి సింగ్ బుధవారం ప్రకటించారు.


మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..”కోచింగ్ సెంటర్ల నియంత్రణ కోసం కొత్త చట్టం తీసుకు రాబోతున్నాం. ఈ చట్టం రూపొందించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీలో సభ్యులుగా.. విద్యార్థులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, కోచింగ్ సెంటర్ నిర్వహకులు ఉంటారు,” అని ఆమె అన్నారు.

ఢిల్లీలో ఇటీవల (జూలై 27) భారీ వర్షాల కారణంగా వరద నీరు కోచింగ్ సెంటర్లను ముంచెత్తింది. ఈ క్రమంలో సెంట్రల్ ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్ మెంట్ లో అనుమతులు లేకుండానే లైబ్రరీ నిర్వహిస్తున్నారు. అయితే వరద నీరు ఆ బేస్ మెంట్ లో చేరడంతో ఆ సమయంలో అక్కడున్న విద్యార్థుల్లో ముగ్గురు చనిపోయారు. బేస్ మెంట్ వరద నీరు బయటికి వెళ్లేందుకు డ్రైనేజి ఏర్పాట్లు లేకపోవడంతో ఈ విషాద ఘటన జరిగింది. ఇలాగా చాలా కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండానే బేస్ మెంట్ లో లైబ్రరీ నడుపుతున్నారని స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని కోచింగ్ సెంటర్లలో తనిఖీలు చేసి.. నిబంధనలకు వ్యతిరేకంగా కోచింగ్ సెంటర్ నడుపుతున్న 29 కోచింగ్ సెంటర్ల నిర్వహకులపై చర్యలకు సిద్ధమవుతోంది.


ఘటన తరువాత రావూస్ స్టడీ సర్కిల్ నిర్వహుకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత కోర్టు వారిని 14 రోజులు జుడిషియల్ కస్టడీలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీలో విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష
వరదనీటిలో సివిల్ సర్వీస్ పరీక్ష విద్యార్థులు చనిపోవడంతో.. ఈ ఘటనకు రావూస్ స్టడీ సర్కిల్ నిర్వహకుల నిర్లక్ష్యమే కారణమని.. వారిని కఠినంగా శిక్షించాలని మంగళవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలో మొత్తం 400 మందికి పైగా విద్యార్థులు నిరసన చేస్తున్నారు. వీరిలో పదిమంది నిరాహర దీక్షలో పాల్గొన్నారు. మూడు రోజుల్లో ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5 కోట్ల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసన జరుగుతున్న ప్రదేశంలో హింస చెలరేగకుండా ప్రభుత్వం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసింది.

Also Read: ‘కులమే లేనివాడు కులగణన గురించి మాట్లాడుతున్నాడు’.. రాహుల్ గాంధీని అవమానిస్తూ.. అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలు

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×