BigTV English

President Murmu Speech: రాష్ట్రపతి ప్రసంగం.. పేపర్ లీక్‌లు, ఆప్ ఎంపీలు దూరం..!

President Murmu Speech: రాష్ట్రపతి ప్రసంగం.. పేపర్ లీక్‌లు, ఆప్ ఎంపీలు దూరం..!

President Droupadi Murmu Speech: భారతదేశం పురోగతి వైపు పయనిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారన్నారు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి గురువారం రాష్ట్రపతి ప్రసంగించారు.  కొత్తగా గెలిచిన ఎంపీలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి లోక్‌సభకు ఎన్నికయ్యారన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రతి సభ్యుడు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు.


ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రథమ కర్తవ్యంగా ఎంపీ పని చేయాలని రాష్ట్రపతి సూచన చేశారు. అభివృద్ధిలో ప్రభుత్వం పరుగులు పెడుతున్న ఆమె, మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమ కోసం పని చేస్తుందని చెబుతూనే, వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. అంతేకాదు రైతులు, మహిళలు, యువత సాధికారత దిశగా అడుగులు వేస్తోందని వివరించారు. తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారన్నారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.

దేశం గ్రీన్‌ఎనర్జీకి ప్రయార్టీ ఇస్తుందన్నారు ప్రెసిడెంట్ ముర్ము. ఈశాన్య ప్రాంతంలో శాంతి స్థిరత్వం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచేందుకు విభజన శక్తులు కుట్రలు పన్నుతున్నాయని, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఏ చర్యనైనా మనమంతా తీవ్రంగా ఖండించాలన్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆప్ ఎంపీలు బాయ్‌కట్ చేశారు. ముఖ్యంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని దూరమయ్యారు.


Also Read: శ్యాం పిట్రోడాకు అదే పదవి, నియమించిన కాంగ్రెస్ హైకమాండ్

ఇటీవల నీట్, నెట్ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో పవిత్ర ఉండాలన్నారు. పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన కేసుల్లో ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. ఈ తరహా వ్యవహారాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిందితులపై కఠినచర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. పనిలో పనిగా ఎమర్జెన్సీ విషయాన్ని ప్రస్తావించారు. దేశ చరిత్రలో అదొక చీకటి అధ్యాయమని, రాజ్యాంగంపై జరిగిన అతి పెద్ద దాడిగా వర్ణించారు. ఈ క్రమంలో గత పదేళ్లలో మోదీ సర్కార్ చేసిన అభివృద్ధి, చేయనున్న అభివృద్ధిని వివరించారామె.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×