BigTV English

Mumbai Metro Line 3: ముంబై మొదటి భూగర్భ మెట్రో లైన్ 3ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఛార్జీల వివరాలు ఇవే

Mumbai Metro Line 3: ముంబై మొదటి భూగర్భ మెట్రో లైన్ 3ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఛార్జీల వివరాలు ఇవే

Mumbai Metro Line 3: ముంబై మెట్రో-3 మొట్టమొదటి భూగర్భ మెట్రో లేదా ఆక్వాలైన్ ప్రారంభమైంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ మెట్రోను ప్రారంభించారు. ఈ మేరకు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRC) ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈ భూగర్భ మెట్రో లైన్ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బికెసి) నుంచి ఆరే కాలనీ జెవిఎల్‌ఆర్‌ను కలుపుతూ శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇది 33.5 కి.మీ పొడవున్న భూగర్భ మెట్రో లైన్, 12.44 కి.మీ విస్తరణ మాత్రమే ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారు. 32,000 కోట్లకు పైగా వ్యయంతో దీనిని అభివృద్ధి చేశారు.


“ ముంబైలో మెట్రో నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఇది పౌరుల జీవన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. ముంబై మెట్రో లైన్ 3 మొదటి దశ కింద ఆరే JVLR నుండి BKC మార్గాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించుకున్నందుకు ముంబై వాసులకు అభినందనలు ” అని మోడీ ప్రారంభోత్సవం తర్వాత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ముంబై మెట్రో 3కి, కోలాబా-బాంద్రా-సీప్జ్ లైన్ అని పేరు పెట్టారు. ఇది 33.5 కి.మీ పొడవున్న భూగర్భ మెట్రో లైన్ – ఇందులో 12.44 కి.మీ విస్తరణ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచబడుతుంది. మెట్రో మార్గంలో 10 స్టేషన్లు ఉన్నాయి. ఆరే, మరోల్ నాకా, సీఎస్ఎంఐఏ టీ1 (టెర్మినల్ 1), ఎంఐడీసీ, ఎస్ఈఈపీజ, సహర్ రోడ్, సీఎస్ఎంఐఏ టీ2 (టెర్మినల్ 2), విద్యానగరి, ధారవి, బీకేసీ వంటి తొమ్మిది స్టేషన్లు భూగర్భంలో ఉన్నాయి. అయితే ఆరే స్టేషన్ మాత్రమే ఈ స్ట్రెచ్‌లో గ్రేడ్-స్థాయి (గ్రౌండ్) స్టేషన్ గా ఉంది. ప్రతీ రోజూ ఈ లైన్‌లో మొత్తం 96 రోజువారీ ట్రిప్పులు నిర్వహించబడతాయి. ఒక్కో మెట్రో రైలులో 2,000 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ లైన్ గరిష్టంగా 85 kmph వేగంతో పని చేసేలా సెట్ చేశారు. సగటు రన్నింగ్ స్పీడ్ 35 kmph గా ఉంటుందని అధికారులు తెలిపారు.


మెట్రో రైలు సమయాలు

ముంబై మెట్రో లైన్ 3 వారాంతపు రోజులలో ఉదయం 6:30 నుండి రాత్రి 10:30 వరకు మరియు వారాంతాల్లో ఉదయం 8:30 నుండి రాత్రి 10:30 వరకు నడుస్తుంది. ఛార్జీలు ₹10 నుండి ₹50 వరకు ఉంటాయి. ప్రయాణికులు యాప్ ద్వారా లేదా ఫిజికల్ కౌంటర్లలో మెట్రో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ కూడా నగరంలో వచ్చే నెల నాటికి అన్ని మెట్రో లైన్లలో చెల్లుబాటు అవుతుంది. జూన్ 2025 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ మెట్రో మార్గం వాహనాల రాకపోకలను 6.5 లక్షల ట్రిప్పుల మేర తగ్గించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×