BigTV English

Prime Minister Modi Oath: పండగలా ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం.. ప్రముఖులతో కిక్కిరిసిన రాష్ట్రపతి భవన్

Prime Minister Modi Oath: పండగలా ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం.. ప్రముఖులతో కిక్కిరిసిన రాష్ట్రపతి భవన్

Prime Minister Modi Oath: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో నేతగా రికార్డు సృష్టించారు. అంతకుముందు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. కాగా, మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్ చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.


ప్రముఖుల సందడి..

రాష్ట్రపతి భవన్‌లో దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. దీంతో రాష్ట్రపతి భవన్ కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోపాటు శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, షేరింగ్ టోబ్గె నేతలు హాజరయ్యారు. అదే విధంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతోపాటు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాజకీయ, సినీ, వ్యాపారస్తులు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినత పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్.. జేడీయూ అధినేత నితీశ్ కుమార్, సుప్రీంకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, సినీనటులు షారుక్ ఖాన్, రజినీకాంత్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి హాజరయ్యారు. వీళ్లతోపాటు 8వేలమంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.


మోదీ టీం @ 72..

మోదీ మంత్రి వర్గంలో 72 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో 30 మంది కేబినేట్ మంత్రులు, 5 మంది సహాయ మంత్రులు(స్వత్రంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రి పదవులు దక్కాయి. కేబినేట్‌లో 27 మంది ఓబీసీలు, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనార్టీలు 5, ఎన్డీఏ మిత్ర పక్షాలకు 11 మంత్రి పదవులు దక్కాయి. ఇందులో 43 మందికి మూడుసార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండడం విశేషం.

Also Read: ఎన్డీఏ ఏకపక్ష నిర్ణయాలు ఇకనుంచి చెల్లవు: సోనియా గాంధీ

కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం..

కేంద్ర మంత్రులుగా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, కుమార స్వామి, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంజీ, లాలన్ సింగ్, శర్బనందా సోనోవాల్, వీరేంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరమ్, గిరిరాజ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్రసింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్, మన్ సుఖ్ మాండవియా, కిషన్ రెడ్డి, చిరాగ్ పాసవాన్, సీఆర్ పాటిల్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావ్ గణపత్ రావు జాదవ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ యశో నాయక్, పంకజ్ చౌదరి, క్రిషన్ పాల్, రాందాస్ అఠవలే, రామ్ నాథ్ ఠాకూర్, నిత్యానంద్ రాయ్, అనుప్రియా పటేల్, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తి వర్ధన్ సింగ్, బీఎల్ వర్మ, శాంతను ఠాకూర్, సురేశ్ గోపి, ఎల్ మురుగన్, అజయ్ తంప్టా, బండి సంజయ్, కమలేశ్ పాసవాన్, భగీరథ్ చౌదరి, సతీశ్ చంద్ర దూబె, సం.య్ సేథ్, రవ్‌నీత్ సింగ్, దుర్గాదాస్, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మజుందార్, సావిత్రి ఠాకూర్‌తోపాటు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు.

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×