Big Stories

Modi : 36 గంటలు.. 5,300 కిలోమీటర్లు.. మోదీ టూర్ షెడ్యూల్ ఇదే..

Modi : 73 ఏళ్ల వయస్సు. కానీ యువనేతల కంటే ఉత్సాహంగా ఉంటారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తారు. యోగా చేస్తారు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎప్పుడూ అలసటగా కనిపించరు. ఆయనే ప్రధాని నరేంద్ర మోదీ.

- Advertisement -

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించినా.. విదేశీ టూర్లలోనైనా మోదీలో ఎప్పుడూ ఎనర్జీ హైలెవల్ లోనే ఉంటుంది. అందుకే ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు జనం ఉత్సాహంగా వస్తారు. తన ప్రసంగాలతో విద్యార్థుల్లో, యువతలో స్ఫూర్తిని నింపుతారు. తాజాగా ప్రధాని ప్రయాణంలో మరో సాహసం చేయబోతున్నారు. సోమ, మంగళవారాల్లో 36 గంటల వ్యవధిలో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. వివిధ నగరాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు వివిధ నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

- Advertisement -

ప్రధాని సుడిగాలి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం మోదీ బయలుదేరతారు.500 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యప్రదేశ్ లోని ఖజురహో చేరుకుంటారు. అక్కడ నుంచి రేవా వెళ్లి జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో పూర్తైన తర్వాత ఖజురహోకు తిరిగివస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి 1,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కొచ్చిలో జరిగే యువమ్‌ సదస్సులో పాల్గొంటారు.

మంగళవారం ఉదయం ప్రధాని కొచ్చి నుంచి 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి మళ్లీ 1,570 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తారు. సిల్వాసాలో నమో వైద్య కళాశాల సందర్శిస్తారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి దమణ్ దీవ్ కు చేరుకుని డేవ్కా సీఫ్రంట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సూరత్‌ మీదుగా తిరిగి ప్రధాని మోదీ ఢిల్లీ చేరుకుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News