
Petrol Diesel price news India(Latest breaking news in telugu) :
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 తగ్గించింది. సామాన్యులకు సర్కారు రాఖీ గిఫ్ట్ ఇచ్చినట్టైంది. ఎన్నికల వేళ ప్రజల ఆగ్రహానికి కేంద్రం దిగొచ్చిందని.. అంతా ఎలక్షన్ స్టంట్ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్యాస్ ధర సరే.. మరి, పెట్రో,డీజిల్ ధరల సంగతేంటి? అవి కూడా తగ్గించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.
గడిచిన కొంతకాలంగా ఇందన ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటేశాయి. లీటర్ పెట్రోల్ సుమారు రూ.110. ఇన్నాళ్లు ధరలు పెరగడమే తప్ప.. తగ్గిన దాఖలాలు లేవు. ఓ దఫా కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు తగ్గించినా.. తెలుగురాష్ట్రాలు మాత్రం కనికరించలేదు.
పెట్రోల్, డీజిల్‌తో పోటాపోటీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ రేట్ తగ్గించడంతో.. ఇప్పుడు ఆయిల్ ధరలు కూడా తగ్గించాలని కోరుతున్నారు. మరి, కేంద్రం ఆ పని చేస్తుందా? రాఖీ గిఫ్ట్ లానే.. ఏ దసరాకో, దీపావళికో వాటి ధరలు కూడా తగ్గిస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు వాహనదారులు. ఇప్పుడు కాకపోయినా.. సార్వత్రిక ఎన్నికల నాటికైనా తగ్గించి తీరుతారని నమ్మకంగా ఉన్నారు.