
KTR latest news(Political news today telangana):
అసలే ఎన్నికలు. గెలుపు ఓటములు అంచనా వేయలేని పరిస్థితి. బీఆర్ఎస్‌కు చావోరేవో. మాగ్జిమమ్ సిట్టింగులకే సీట్లిచ్చారు కేసీఆర్. ఆ తర్వాత అలకలు, ఆవేశాలు, ఫిరాయింపులు.. ఇలా కారులో లొల్లిలొల్లి నడుస్తోంది.
కేటీఆర్ లేని సమయంలోనే కేసీఆర్ టికెట్లు అనౌన్స్ చేశారు. ఎమ్మెల్యే రేఖానాయక్ హ్యాండిచ్చారు. తుమ్మల కారు దిగుతున్నారు. బేతి.. దేత్తడి అంటున్నారు. వారిని బుజ్జగించాల్సిన కేటీఆర్ మాత్రం అవుటాఫ్ కవరేజ్ ఏరియా.
ఇంతటి కీలక సమయంలో కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో లేకపోవడం ఆసక్తికరంగా మారింది. ఏకంగా అమెరికాకే ఎగిరిపోయారు. లాంగ్ ట్రిప్ వేశారు. ఎందుకు? అక్కడ అంత అర్జెంట్ పని ఏముంది? అదికూడా ఈ టైమ్‌లో? అనే చర్చ నడుస్తోంది.
పెట్టుబడుల కోసమా? అంటే కాకపోవచ్చు, మరో మూడు నెలల్లో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలీదు. ఏదైనా సదస్సుకు హాజరయ్యారా? అంటే అలాంటి న్యూస్ ఏదీ రాలేదు. ఫ్యామిలీ ట్రిప్ అనుకోవడానికి లేదు. కేటీఆర్ అమెరికాలో ఏం చేస్తున్నారనే దానిపై అప్‌డేట్స్ రావట్లేదు. అంటే.. సీక్రెట్‌గా ఏదో చక్కబెడుతున్నారనేగా? అని అంటున్నారు విమర్శకులు. లేటెస్ట్‌గా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సైతం ఇదే అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉందంటూ పరోక్షంగా హవాలా విషయం ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.
బహుషా, ఎలక్షన్ ఫండ్ మేనేజ్ చేయడం కోసమే కేటీఆర్ యూఎస్ వెళ్లారని డౌట్ అయితే వినిపిస్తోంది. ఇక్కడి నుంచి అక్కడికి.. అక్కడి నుంచి ఇక్కడికి.. బ్లాక్‌ను వైట్.. వైట్‌ను బ్లాక్ చేసే హవాలా తంతు ఏదైనా జరుగుతోందా? అనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
ఎన్నికలను డబ్బుతో శాసించడం గులాబీ బాస్‌కు బాగా అలవాటే. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ ఎన్నికలే రావడంతో.. లెక్కపెట్టలేనంత పెద్ద మొత్తమే అవసరం పడుతుందని అంటున్నారు. లక్ష్మీదేవిని అలా గాల్లో తీసుకొచ్చి.. ఓటర్ల మీద గుమ్మరించేలా.. తెరవెనుక వ్యవహారం నడిపిస్తున్నారనే ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదంతా నిజమో కాదో తెలీదు కానీ.. పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం కేటీఆర్ అమెరికా ట్రిప్ మీద ఆసక్తికర చర్చే నడుస్తోంది.