Pune Court Attack: మహారాష్ట్ర పూణేలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఓ హత్య కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన నిందితుడిపై దుండగులు అత్యంత కిరాతకంగా దాడికి తెగబడ్డారు. శివాజీనగర్ కోర్టు వెలుపల మిట్ట మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారడంతో నెటిజన్లు సైతం దాడి జరిగిన తీరును చూసి ఆందోళనకు గురవుతున్నారు.
హత్య కేసులో నిందితుడిగా ఉన్న 35 ఏళ్ల మందార్ మారుతి కివాలే.. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వచ్చాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఇద్దరు దుండగులు అతనిపై ఒక్కసారిగా వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. అనంతరం అతనిపై కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కొందరు వీడియోల్లో రికార్డు చేశారు. దాడి అనంతరం నిందితులు రెండు బైక్స్ పై అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీస్‌లు, లాయర్లు ఉన్న కోర్టు బయటే గొడ్డలితో హత్య.. పుణెలో గ్యాంగ్స్టర్ల బరితెగింపు
🔹 పుణెలోని శివాజీనగర్ కోర్టు బయట కాల్పులకు తెగబడిన దుండగులు.. తుపాకీ గురి తప్పడంతో గొడ్డలితో దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. కోర్టు బయటే ఈ ఘటన చోటుచేసుకుంది.
🔹 భారీగా పోలీసులున్నా, లాయర్లు ఉన్నా పట్టపగలే దుండగులు హత్యకు తెగబడటంతో పుణెలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
#Pune #CrimeNews #CourtAttack #LawAndOrder
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) November 25, 2026
అయితే దుండగుల దాడి అనంతరం కూడా కివాలే లేచి నిలబడ్డాడు. ఒళ్లంతా రక్తంతో తడిచిన స్థితిలోనే రోడ్డుదాటాడు. ఆపై అక్కడే ఉన్న ఫుట్ పాత్ పై అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కివాలేను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు పిస్టల్స్, ఒక మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది ఏప్రిల్‌లో పూణేలోని సంతోష్‌నగర్ కత్రాజ్ ప్రాంతంలో జరిగిన ఓ హత్య కేసులో మందార్ కివాలే నిందితుడిగా ఉన్నాడు. భూమి, ఆర్థిక వివాదాల నేపథ్యంలో 26 ఏళ్ల రెస్టారెంట్ యజమాని శుభం సుభాష్ చవాన్‌ను కివాలే, అతని అనుచరులు క్రికెట్ స్టంప్స్, వెదురు కర్రలతో కొట్టి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్ సకోరేతో పాటు కివాలే, గిరీష్ సుభాష్ బాబరే, యోగేష్ బాబూరావు డోరేలను పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైన కివాలే.. కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు రాగా ఈ దాడి జరిగింది.
Also Read: బిస్లరీ ఎఫెక్ట్.. ప్యాకేజ్డ్ వాటర్ నాణ్యతపై FSSAI కొరడా.. దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరణ!
కోర్టు వెలుపలే ఇలాంటి ఘటన జరగడంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూణే పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు.
Also Read: ‘బయటకు వెళ్దాం.. నేను చెప్పిన బట్టలు వేసుకో’.. విద్యార్థినికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు!