E-Paper
Advertisement

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపై విమర్శలా? కేటీఆర్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్!

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపై విమర్శలా? కేటీఆర్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్!
Advertisement

Chamala Kiran: తెలంగాణ సాధనలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పాత్రను విస్మరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 32 మందికి పైగా ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సోనియాను కలిసి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

కుటుంబ రాజకీయాలు, అప్పులపై విమర్శలు

Advertisement

తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రం పదవుల పరంగా సర్వస్వం సాధించుకుందని చామల ఎద్దేవా చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీని గాలికొదిలి కేసీఆర్ స్వయంగా ఆ పదవిని చేపట్టారని.. అమెరికాలో ఉద్యోగం వదిలివచ్చిన కేటీఆర్‌కు మాత్రం మంత్రి కట్టబెట్టారని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని సుమారు 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారని.. ఫలితంగా ప్రతి నెలా రూ.8 వేల కోట్ల వడ్డీ భారం పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర సంపదను పెంచాల్సింది పోయి అప్పులమయం చేశారని దుయ్యబట్టారు.

రూ.5 లక్షల బీమా

Advertisement

ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళా శక్తి పథకాల ద్వారా వారిని కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే కోటికి పైగా కుటుంబాలకు రూ.5 లక్షల బీమా పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే కేటీఆర్ కుటుంబం కూడా ఈ బీమాను వినియోగించుకోవచ్చని ఆయన వ్యంగ్యంగా అన్నారు. చేర్యాలలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి సంక్షేమ పథకాలను రాజకీయం చేసేందుకు యత్నించారని తప్పుబట్టారు. కేవలం ప్రెస్‌మీట్లు, ట్వీట్లు చేయడం మాని ప్రజా సంక్షేమానికి సహకరించాలని కేటీఆర్‌కు చామల హితవు పలికారు.

Also Read: సిద్దిపేటకు పట్టిన చీడ త్వరలో వదులుతుంది.. హరీష్ రావుకు మెట్టుసాయి మాస్ కౌంటర్

Tags

Related News

సిద్దిపేటకు పట్టిన చీడ త్వరలో వదులుతుంది.. హరీష్ రావుకు మెట్టుసాయి మాస్ కౌంటర్

‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా!’.. కన్నీరు పెట్టిస్తున్న వరంగల్ దంపతుల సూసైడ్ నోట్!

‘నా భార్య ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు’.. సెల్ఫీ వీడియో పెట్టి యువకుడి అదృశ్యం

ఎర్ర బస్సు స్టయిల్‌లో.. విమానం ఎక్కిన పల్లెటూరు దంపతులు, వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు

హైదరాబాద్‌ సిటీలో మరోసారి భూముల అమ్మకం.. ఏయే ప్రాంతాలు, ఈ-ఆక్షన్ తేదీలు ఇవే!

ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయం చాలా ప్రమాదకరం.. ఎలానో క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత!

Big Stories

Advertisement
×