E-Paper
Advertisement

ఒక మహిళ వీలునామా రాయకుండానే చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది? చట్టం ఏం చెబుతోందంటే

ఒక మహిళ వీలునామా రాయకుండానే చనిపోతే ఆస్తి ఎవరికి దక్కుతుంది? చట్టం ఏం చెబుతోందంటే
Advertisement

Women’s property inheritance rules in India| ఒక మహిళ తన జీవితకాలంలో ఇల్లు, స్థలం, బంగారం, పొదుపు వంటి ఎన్నో ఆస్తులు సంపాదించి చనిపోయింది. అయితే ఆమె వీలునామా (Will) రాయకుండానే మరణిస్తే ఆ ఆస్తులు ఎవరికి చెందుతాయి? భర్తకా, పిల్లలకా, తల్లిదండ్రులకా? చాలామందికి దీనిపై స్పష్టత ఉండదు. భారతదేశంలో మహిళల ఆస్తి వారసత్వానికి ఒకే చట్టం వర్తించదు. ఆమె మతం, కుటుంబ పరిస్థితులు, ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలు కూడా కీలకంగా మారతాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్సీ మహిళలకు వేర్వేరు వారసత్వ నిబంధనలు ఉన్నాయి. మరి ఏ మతానికి చెందిన మహిళ ఆస్తి ఎవరికి దక్కుతుంది? తెలుసుకుందాం.

1. మహిళ మతాన్ని బట్టి వారసత్వ చట్టం

ఒక వ్యక్తి వీలునామా రాయకుండానే మరణిస్తే, దాన్ని చట్టపరంగా ఇంటెస్టేట్ (Intestate) అంటారు. అప్పుడు వర్తించే వారసత్వ చట్టం ఆధారంగా ఆస్తి పంపిణీ జరుగుతుంది.

  •  హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మహిళలకు హిందూ వారసత్వ చట్టం, 1956 వర్తిస్తుంది.
  •  ముస్లిం మహిళలకు షరియత్ చట్టం, 1937 ప్రకారం వారసత్వ నిబంధనలు వర్తిస్తాయి.
  • క్రైస్తవ మహిళలకు భారత వారసత్వ చట్టం, 1925 వర్తిస్తుంది.
  •  పార్సీ మహిళలకు కూడా భారత వారసత్వ చట్టం, 1925 వర్తిస్తుంది.

2. హిందూ మహిళ మరణిస్తే భర్త, పిల్లలకు సమాన వాటాలు

Advertisement

హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. వివాహిత మహిళ మరణిస్తే ఆమె భర్త, కుమారులు, కుమార్తెలు మొదటి ప్రాధాన్య వారసులుగా ఉంటారు.
ఉదాహరణకు ఆమెకు భర్త, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉంటే ముగ్గురికీ సమాన వాటాలు లభిస్తాయి. మరణించిన కుమారుడు లేదా కుమార్తె సంతానం కూడా వర్తించే నిబంధనల ప్రకారం వారి వాటాను పొందవచ్చు.

3. పిల్లలు లేకపోతే బంధువులకు

హిందూ మహిళకు పిల్లలు లేకపోతే, వారసత్వ చట్టం నిర్దేశించిన క్రమంలో ఆస్తి పంపిణీ జరుగుతుంది.
1. భర్త వారసులు
2. తల్లి, తండ్రి
3. తండ్రి వారసులు
4. తల్లి వారసులు
ముందున్న కేటగిరీలో అర్హులైన వారసులు లేకపోతేనే తదుపరి కేటగిరీకి అవకాశం ఉంటుంది.

4. ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ముఖ్యం

Advertisement

హిందూ మహిళకు పిల్లలు లేకపోతే, ఆస్తి మూలాన్ని బట్టి వారసులు మారవచ్చు.

  •  తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి తండ్రి వారసులకు అంటే చనిపోయిన మహిళ సోదరులు, సోదరీమణులకు వెళ్తుంది.
  •  భర్త లేదా మామ నుంచి వచ్చిన ఆస్తి భర్త వారసులకు అంటే భర్త సోదర, సోదరీమణులకు, ఆయనకు పుట్టిన పిల్లలకు చెందుతుంది.
  •  అవివాహిత మహిళ పిల్లలు లేకుండా మరణిస్తే, ఆమె స్వయంగా సంపాదించిన ఆస్తి సాధారణంగా తల్లిదండ్రులకు వెళ్తుంది.

5. ముస్లిం మహిళల ఆస్తికి నిర్దిష్ట వాటాలు

ముస్లిం వారసత్వ చట్టం ప్రకారం భర్త, పిల్లలు, తల్లిదండ్రులు వంటి దగ్గరి బంధువులకు నిర్దిష్ట వాటాలు లభిస్తాయి. మిగిలిన ఆస్తిని అర్హులైన ఇతర బంధువులు పొందవచ్చు. సున్నీ, షియా సంప్రదాయాలను బట్టి వాటాల్లో మార్పులు ఉంటాయి. బతికి ఉన్న కుటుంబ సభ్యులను బట్టి పంపిణీ నిర్ణయమవుతుంది.

6. క్రైస్తవ మహిళల ఆస్తి భారత వారసత్వ చట్టం ప్రకారం

వీలునామా లేకపోతే భారత వారసత్వ చట్టం, 1925 ప్రకారం క్రైస్తవ మహిళ ఆస్తి పంపిణీ జరుగుతుంది. భర్త, పిల్లలు ఉన్న క్రైస్తవ మహిళ మరణిస్తే భర్తకు మూడో వంతు ఆస్తి లభిస్తుంది. మిగిలిన మూడింట రెండొంతుల ఆస్తి వాటా పిల్లలు సమానంగా పంచుకుంటారు. పిల్లలు లేకపోతే చట్టంలోని ఇతర నిబంధనల ప్రకారం భర్త, అర్హులైన బంధువులకు వాటాలు లభిస్తాయి.

Also Read: రిలేషన్‌లో ప్రేమ, నమ్మకం పెరగాలంటే మీ భాగస్వామిని రోజూ ఈ 5 ప్రశ్నలు అడగండి

7. పార్సీ మహిళలకు కూడా ప్రత్యేక వారసత్వ నిబంధనలు

పార్సీ మహిళల ఆస్తి పంపిణీకి కూడా భారత వారసత్వ చట్టం, 1925 లోని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. భర్త, పిల్లలు, ఇతర అర్హులైన బంధువుల ఆధారంగా ఆస్తి వాటాలు నిర్ణయిస్తారు.

Also Read: భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

8. వీలునామా రాయడం ఎందుకు ముఖ్యం?

మహిళ వీలునామా రాయకపోతే చట్టం నిర్ణయించిన వారసత్వ క్రమం ప్రకారం ఆస్తి పంపిణీ జరుగుతుంది. వీలునామా రాయడం ద్వారా తన ఆస్తి ఎవరికి చెందాలో ముందుగానే తెలియజేయవచ్చు. అయితే వ్యక్తిగత చట్టాలు, చట్టపరమైన నిబంధనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆస్తి విషయంలో ముందుగానే ప్రణాళిక చేసుకోవడం కుటుంబ వివాదాలను తగ్గిస్తుంది.

గమనిక

ఈ కథనం సాధారణ న్యాయ సమాచారం కోసం మాత్రమే. ప్రతి కేసులో కుటుంబ పరిస్థితులు, వర్తించే చట్టాలను బట్టి ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత సలహా కోసం న్యాయవాదిని సంప్రదించండి.

Related News

CNG ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కలకలం.. తెల్లని పొగ మాదిరిగా ఆ ప్రాంతమంతా, భయంతో స్థానికులు పరుగులు

రహస్యంగా రికార్డ్ చేసిన ఫోన్ సంభాషణలు సాక్ష్యంగా చెల్లుతాయా? విడాకుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇదే

మధురై తనిష్క్ దోపిడీ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితుడు అరెస్ట్, 11.7 కిలోల బంగారం రికవరీ

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 100 మీటర్ల లోయలో పడ్డ బస్సు, 8 మంది మృతి

ఎస్‌ఐఆర్‌పై రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్.. ఈసీఐకి 48 ప్రశ్నలు!

తండ్రిపై దాడికి ప్రతీకారం.. హోటల్‌పై అక్కాచెల్లెళ్ల దాడి.. చుక్కలు చూపించేశారు భయ్యా!

బిల్కిస్ బానో కేసులో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!

Big Stories

Advertisement
×