BigTV English

DNA Test: బిచ్చగాళ్లకు DNA టెస్ట్ లు, పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎందుకో తెలుసా?

DNA Test: బిచ్చగాళ్లకు DNA టెస్ట్ లు, పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎందుకో తెలుసా?
Advertisement

చాలా చోట్ల బిచ్చగాళ్లు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని భిక్షాటన చేస్తూ కనపడతారు. బిడ్డకు పాలు లేవు డబ్బులివ్వండి అంటూ కనపడినవారినల్లా ప్రాధేయపడతారు. ఇంకొంతమంది బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు, ఆస్పత్రికి తీసుకెళ్లాలి డబ్బులు కావాలంటారు. ఇలా బిడ్డల సింపతీని అడ్డు పెట్టుకుని చాలామంది భిక్షాటన చేస్తుంటారు. ఇలాంట వారిలో నిజంగా అవసరం ఉన్నవారు లేరని చెప్పలేం కానీ, ఆ అవసరాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించేవారే ఎక్కువమంది కనపడతారు. అయితే ఆ చిన్నారులు వారి పిల్లలేనా, వారితో రక్త సంబంధం ఉన్నవారేనా..? అనే అనుమానాలు రాకమానవు. చిన్నారులను కిడ్నాప్ చేసే బిచ్చగాళ్ల ముఠాలకు సరఫరా చేసే కేటుగాళ్లు కూడా అక్కడక్కడ పోలీస్ రికార్డుల్లో నమోదవుతుంటారు. ఈ నేపథ్యంలో బిచ్చగాళ్ల మాఫియాకు చెకె పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. బిచ్చగాళ్లకు, వారి చేతిలోని పిల్లలకు డీఎన్ఏ టెస్ట్ లు చేయడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.


భిక్షాటన లేని రాష్ట్రంగా పంజాబ్ ని తీర్జిదిద్దాలని చూస్తోంది అక్కడి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఎన్నికల్లో కూడా ఈమేరకు హామీ ఇచ్చారు నేతలు. అయితే ఇప్పుడు ఆ హామీని అమలులో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బిచ్చగాళ్లు లేని రాష్ట్రం అంటే వారందరికీ గౌరవప్రదమైన ఉపాధి చూపించే రాష్ట్రం అని చెప్పుకోవాలి. మిగతా వారిని ఆ వృత్తిలోకి రాకుండా అడ్డుకోవడంతోపాటు, నిరుపేదలు భిక్షాటనవైపు మళ్లకుండా వారికి సౌకర్యాలు కల్పించాలి. ఇదంతా చేయడం అసాధ్యం అనేవారు కూడా ఉన్నారు. అయితే తమకు ఉన్న వనరుల్లో కనీసం బిచ్చగాళ్ల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పసిపిల్లల అక్రమ రవాణాను అరికట్టే దిశగా తొలి అడుగు వేసింది.

చేతిలో పిల్లలతో రోడ్లపైకి వచ్చే బిచ్చగాళ్లను ముందుగా అధికారులు గుర్తిస్తారు. అసలు ఆ పిల్లలకు వారిని ఎత్తుకుని తిప్పే వారికి సంబంధం ఉందా లేదా అని ఆరా తీస్తారు. తప్పు ఒప్పుకుంటే సరేసరి లేదంటే డీఎన్ఏ టెస్ట్ కి సిద్ధం కావాలని చెబుతారు. డీఎన్ఏ మ్యాచ్ కాకపోతే ఆ పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లకు తరలిస్తారు. ఇలా పిల్లల్ని బిచ్చగాళ్ల వలనుంచి విడిపించేందుకు పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు బిచ్చగాళ్ల సంఖ్యను తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అంటున్నారు అధికారులు.


భిక్షాటన చేస్తున్న పిల్లలకు, వారి వెంటనున్న పెద్దలకు సంబంధం లేదని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. అక్రమ మార్గాల్లో పిల్లలను తీసుకొచ్చిన వారిని జైలుకు పంపిస్తామని అంటున్నారు. బాలల అక్రమ రవాణాను అడ్డుకోవడమే దీని లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ముందుగా పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభిస్తోంది. బిచ్చగాల్లకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని ఐదు జిల్లాల అధికారులకు పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఐదు జిల్లాల్లో ఆశించిన ఫలితాలు వస్తే మొత్తం రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశముంది.

Related News

Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో టెక్నికల్ ఎర్రర్! గంటసేపు గాల్లోనే..

President Droupadi Murmu: రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్‌కు ప్రమాదం.. ల్యాండ్ అయిన వెంటనే….

Chai Wala Scam: చాయ్ వాలా ఇంట్లో సోదాలు.. షాక్ అయిన పోలీసులు..

Delhi News: దీపావళి ఎఫెక్ట్.. రెడ్ జోన్‌లో ఢిల్లీ, ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం

Sadhvi Pragya Singh: ఆ పని చేస్తే మీ కూతుళ్ల కాళ్లు విరగ్గొట్టండి.. ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Maoist Party: మల్లోజుల లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖ

Pakistan – Afghanistan: ఉద్రిక్తతలకు తెర.. కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్థాన్ -అఫ్గానిస్థాన్

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే.. ‘బ్రహ్మోస్’ పాక్ తాట తీస్తుంది: రాజ్ నాథ్ సింగ్

Big Stories

×