E-Paper
Advertisement

Puri Chandanotsavam Event Fire cracker Explosion: పూరీ చందనోత్సవంలో అపశ్రుతి, బాణాసంచా పేలుడులో

Puri Chandanotsavam Event Fire cracker Explosion:  పూరీ చందనోత్సవంలో అపశ్రుతి, బాణాసంచా పేలుడులో
Advertisement

Puri Chandanotsavam Event Fire cracker Explosion: ఒడిషాలోని పూరీ జగన్నాథుడి చందనోత్సవం లో అపశ్రుతి చోటు చేసుకుంది. చందనోత్సవం కార్యక్రమం జరుగుతున్న సమయంలో   బాణసంచా పేలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి.

బుధవారం రాత్రి పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందనోత్సవం నిర్వహించారు ఆలయ నిర్వాహకులు. దీన్ని వీక్షించేందుకు వేలాది మంది అక్కడికి తరలించారు. ఈ క్రమంలో కొందరు భక్తులు టపాసులు పేల్చారు. అయితే నిప్పు రవ్వులు బాణసంచా నిల్వ ఉంచిన చోటపడ్డాయి.

Advertisement

దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. మరికొందరైతే ప్రాణాలు కాపాడుకునేందుకు పుష్కరిణిలో దూకారు. గురువారం ఉదయం పుష్కరిణిలో గాలింపు చేపట్టారు అధికారులు.

గాయపడినవారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులతో సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

ALSO READ: మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దీదీ.. మాములుగా లేదుగా..?

ఈ ఘటనపై భక్తులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో రాజకీయాలు పూరి ఆలయం చుట్టూనే తిరిగాయి. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. అయినా రాజకీయాల్లో దేవుడ్ని తీసుకురావడం మంచిదికాదని అంటున్నారు.

 

Tags

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×