Rahul Gandhi: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతోందంటూ ఆరోపించారు లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ. ఉద్దేశ పూర్వకంగా లక్షల ఓట్లను తొలగించిందని విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. కేవలం ఆరోపణలు కాదని, పక్కా ఆధారాలతో చెబుతున్నానని వెల్లడించారు.
సాప్ట్‌వేర్, నకిలీ దరఖాస్తులతో ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల ఫోన్ నెంబర్లను వినియోగించారని అన్నారు. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి? వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై తాము కర్ణాటక ఈసీని ప్రశ్నించినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.
సూర్యకాంత్ వ్యక్తి గుర్తింపును దుర్వినియోగం చేసి 14 నిమిషాల్లో 12 నకిలీ ఓట్ల తొలగింపు ఫారమ్‌లను దాఖలు చేశారని ఆరోపించారు. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు కోరినా ఈసీ స్పందించలేదన్నారు. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6851 ఫేక్ ఓట్లు కలిపారని వివరించారు.
ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో కీలక విషయాలు బయటపెట్టారు. ‘ఓటు చోరీ’పై హైడ్రోజన్ బాంబ్ పేల్చుతానని ఇప్పటికే ప్రకటించారు రాహుల్ గాంధీ. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా ఓట్లు డిలీట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని, మాకు ఓట్ల తొలగింపు ఐడీలు, OTP వివరాలు ఇవ్వాలన్నారు.
ALSO READ: మోదీ@ పిట్ నెస్ సీక్రెట్స్.. ఆ శక్తి వెనుక రహస్యాలు
ఒకప్పుడు కర్ణాటకలో ఈసీగా ఉన్న ఆయన ప్రస్తుతం ఢిల్లీలో సీఈసీలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ బూత్‌లను కేవలం టార్గెట్ చేశారని రుసరుసలాడారు. ఈ అంశంపై కోర్టుకు వెళతారా అని మీడియా ప్రశ్నించింది. ప్రజలకు సత్యాన్ని చూపించడమేనని తన పని అని, అదే చేస్తున్నానని పష్టంగా చెప్పారు రాహుల్‌గాంధీ.
ఉద్దేశపూర్వకంగా లక్షలాది ఓటర్లను తొలగించారని ధ్వజమెత్తారు. నకిలీ ఓట్లకు లింక్ చేసినవన్నీ ఫేక్ ఫోన్ నెంబర్లని, ఆయా నెంబర్లకు కాల్ చేస్తే పని చేయలేదన్నారు. కాంగ్రెస్‌కు బలం ఉన్న చోట ఓట్లు తొలగించారని, తాను చెబుతున్నవన్నీ ఆరోపణలు కాదన్నారు. ముమ్మాటికీ వాస్తవాలని, చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సాప్ట్‌వేర్, నకిలీ దరఖాస్తులతో ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల ఫోన్ నెంబర్లను వినియోగించారని అన్నారు. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి? వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై తాము కర్ణాటక ఈసీని ప్రశ్నించినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.
దేశంలో చట్టపరమైన సంస్థలు చాలా ఉన్నాయని, ఈ విషయాన్ని వారంతా పరిశీలించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడం తమ పని కాదని, ఆ సంస్థల పని అని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, యూపీ వంటి రాష్ట్రాల్లో ఓట్లు తొలగిస్తోందన్నారు. ఓటు చోరికి ఇదొక ఉదాహరణగా చెప్పారు. వీటిపై వారంలోపు CEC వివరాలు ఇవ్వాలన్నారు.
ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశం
ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేల్చుతానని ఇప్పటికే ప్రకటించిన రాహుల్
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని ఎన్నికల సంఘం కాపాడుతోందంటూ ధ్వజం
ఉద్దేశపూర్వకంగా లక్షల ఓట్లను తొలగించారని విమర్శలు
కర్ణాటక అసెంబ్లీ… pic.twitter.com/uegAPkQl5A
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2025