BigTV English

Rahul Gandhi: లుక్కు, గెటప్పు మార్చేసిన రాహుల్.. ఎందుకంటే? ఎక్కడంటే?

Rahul Gandhi: లుక్కు, గెటప్పు మార్చేసిన రాహుల్.. ఎందుకంటే? ఎక్కడంటే?

Rahul Gandhi: రాహుల్ గాంధీ అంటేనే గుబురు గడ్డం.. పెరిగిన జుట్టు. వంటిపై వైట్ టీషర్టు. కొన్ని నెలలుగా రాహుల్ అంటే ఇదే అవతారం. భారత్ జోడో యాత్రతో నాలుగు నెలల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. గడ్డం గీసుకోకుండా.. జుట్టు కట్ చేయకుండా.. కమిట్‌మెంట్‌తో యాత్ర చేశారు. రంగురంగుల డ్రెస్సులు కూడా వేసుకోలేదు. జస్ట్.. వైట్ టీషర్ట్. అంతే. చలి చంపేస్తున్నా.. కనీసం స్వెటర్ కానీ, జాకెట్ కానీ వేసుకోలేదు. దేశంలో సరైన దుస్తులు లేని పేదలు ఎంతోమందిని చూశానని.. అందుకే తాను సైతం ఎలాంటి ఆడంబరాలకు పోలేదని రాహుల్ చెప్పారు.


రాహుల్ లుక్, గెటప్ ఆయనకు మరింత ఇమేజ్ తీసుకొచ్చింది. భారత్ జోడో యాత్రతో ఆయన పడిన కష్టమంతా ఆ గెటప్‌లోనే కనిపించింది. మరి యాత్ర ముగిసింది. వాట్ నెక్ట్స్? గడ్డం అలానే ఉంచేస్తారా? జుట్టు కట్ చేసుకోరా? అంటే, ఏమో తనకూ తెలీదని.. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవాలని రాహుల్ గాంధీనే అన్నారు. కట్ చేస్తే.. ఆ సమయం రానే వచ్చింది. లేటెస్ట్‌గా రాహుల్ షేవ్ చేసుకున్నారు. కంప్లీట్ షేవ్ కాదు.. జస్ట్ గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారు. హెయిర్ కటింగ్ కూడా చేయించుకున్నారు. సూటు, బూటు, టై వేసుకొని.. లండన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్.

రాహుల్ గాంధీ న్యూ లుక్ అదిరిపోయింది. లండన్‌లో కొత్త గెటప్‌లో, స్టైలీష్‌ లుక్‌తో కనిపించిన రాహుల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఓ ప్రోగ్రామ్‌కు అటెండ్ అయ్యారు రాహుల్. ఆయన చదివింది అక్కడే. రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ ప్లీనరీ ముగిశాక.. నేరుగా యూకే వచ్చేశారు. వారం పాటు లండన్‌లో పర్యటించనున్నారు.


కేంబ్రిడ్జి వర్సిటీలో ‘‘లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ద ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’’ అనే అంశంపై రాహుల్ గాంధీ గెస్ట్ స్పీచ్ ఇవ్వనున్నారు. ఇంకా.. బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, భారత్‌- చైనా సంబంధాలపై ప్రత్యేక సెషన్లలో ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ. ఈ ప్రోగ్రామ్స్‌కు అటెండ్ అయ్యేందుకు వచ్చిన రాహుల్.. ఇలా ట్రిమ్ చేసుకున్న గడ్డం, కత్తిరించుకున్న జుట్టు, సూటు, బూటుతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. కొత్త గెటప్ అదిరిందయ్యా రాహుల్..అంటున్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×