BigTV English

Hyderabad: ఆ నలుగురు నరకం చూపించారు, వదిలిపెట్టొద్దు.. సాత్విక్ సూసైడ్‌ నోట్‌ కలకలం

Hyderabad: ఆ నలుగురు నరకం చూపించారు, వదిలిపెట్టొద్దు.. సాత్విక్ సూసైడ్‌ నోట్‌ కలకలం

Hyderabad: కార్పొరేట్ కాలేజ్. ఇంటర్ చదవాలంటే అందులోనే చదవాలి. ఒకటి రెండు మూడు.. ర్యాంకులంటూ యాడ్స్‌తో ఊదరగొడతారు. ఆ కాలేజీలో చదివితే తమ పిల్లలకు మంచి ర్యాంక్ వస్తుందని పేరెంట్స్ భావిస్తుంటారు. పోలో మంటూ కాలేజీ ముందు క్యూ కట్టి.. అడిగినంత ఫీజు నోరెత్తకుండా కట్టేసి.. తమ బాధ్యత తీర్చేసుకుంటారు. ఆ తర్వాత తెలుస్తుంది.. ఆ కాలేజీలు ర్యాంకుల ఖజానా మాత్రమే కాదు.. నరక కూపాలని.


ర్యాంకులు వచ్చేవి ఏ కొద్ది మందికే. కానీ, ఆయా కాలేజీల్లో చదివేది లక్షలాది మంది. చాలామంది కనీసం పాస్ కూడా కారు. స్పెషల్ క్యాంపస్‌లు కానిచోట.. మామూలు చదువులే చెబుతారు. క్రమశిక్షణ పేరుతో కర్ర పెత్తనం మాత్రం చేస్తుంటారు. సూసైడ్ చేసుకున్న ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ విషయంలో ఇలానే జరిగింది. కాలేజీ ప్రిన్సిపల్, ఇంఛార్జ్, లెక్చరర్ల టార్చర్ భరించలేక.. బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిందీ దారుణం.

ఓ కార్పొరేట్‌ కాలేజ్‌లో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్‌.. మంగళవారం రాత్రి స్టడీ అవర్‌ అయిపోగానే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని చూసిన క్లాస్‌మేట్స్ వెంటనే రక్షించే ప్రయత్నం చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే సాత్విక్‌ చనిపోయాడని డాక్టర్లు చెప్పడం విషాధం నింపింది.


సాత్విక్ మృతిపై అతని పేరెంట్స్, రిలేటివ్స్, స్టూడెంట్ యూనియన్స్.. నార్సింగిలోని కాలేజీ దగ్గర ఆందోళనకు దిగాయి. న్యాయం చేయాలని.. కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

సాత్విక్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న సాత్విక్ జేబులో సూసైడ్ లెటర్‌ స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు కారణమైన వారి వివరాలు రాశాడు. “అమ్మా, నాన్న.. నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపల్‌, ఇన్‌ఛార్జి, లెక్చరర్ల వల్లే చనిపోతున్నా. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్‌, నరేశ్‌ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. ఈ నలుగురు హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఆ నలుగురిని వదిలిపెట్టొద్దు. చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్‌ యూ, మిస్‌ యూ ఫ్రెండ్స్‌” అని సూసైడ్‌ నోట్‌లో రాశాడు సాత్విక్‌.

ఘటనపై విద్యాశాఖ మంత్రి సబిత స్పందించారు. చదువుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం తగదన్నారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×