E-Paper
Advertisement

జానీ మాస్టర్ పై మరో సంచలన పోస్ట్ పెట్టిన శ్రేష్టి వర్మ!

జానీ మాస్టర్ పై మరో సంచలన పోస్ట్ పెట్టిన శ్రేష్టి వర్మ!
Advertisement

Shrasti Verma:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ (Jani master) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అటు మహిళలలో శ్రేష్ఠి వర్మ (Shrasti Varma) కూడా లేడీ కొరియోగ్రాఫర్ గా మరింత పేరు సొంతం చేసుకుంది. అలాంటి ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో.. తాను మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ శ్రేష్టి వర్మ ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

శ్రేష్టి వర్మపై జానీ మాస్టర్ సంచలన కామెంట్..

ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు పెట్టి అరెస్టు కూడా చేశారు. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఒకవైపు సినిమాలు, మరొకవైపు షోలు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న ఢీ డ్యాన్స్ కొత్త సీజన్ లో తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన మాట్లాడారు. దీంతో ఆయన మాటలకు శ్రేష్టి వర్మ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఢీ లేటెస్ట్ సీజన్లో జడ్జిగా వ్యవహరిస్తున్న జానీ మాస్టర్ లేటెస్ట్ ఎపిసోడ్లో తనపై శ్రేష్టి వర్మ చేసిన ఆరోపణలను ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త బయటకు వచ్చింది. అందులో జానీ మాస్టర్ మాట్లాడుతూ..” నామీద ఒక అమ్మాయి, పైగా మన డాన్సరే వచ్చి “జానీ మాస్టర్ జీరో” అని చెప్పింది. నా మీద లక్ష ఆరోపణలు చేసింది. అప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు రా? నేను కరెక్ట్ అయినప్పుడు అవతలి వాళ్ళు ఎన్ని అనుకుంటే నాకెందుకు”.. అంటూ మాట్లాడారు.

Advertisement

also read:మంచు మనోజ్ చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ రిలీజ్!

ఆ హక్కు నీకు ఎవరిచ్చారు?

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. శ్రేష్టి వర్మ కూడా ఈ విషయంపై సంచలన పోస్టు పెట్టింది. జానీ మాస్టర్ కి సంబంధించిన వీడియో క్లిప్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ..” నిజం వెలుగులోకి వచ్చినప్పుడు అపరాధ భావం కలిగిన వ్యక్తి ఇంకా గట్టిగా మాట్లాడతాడు. ఆ లేడీ డాన్సర్ చేసిన స్టేట్మెంట్ నిజంగా నిన్ను ఇబ్బంది పెట్టకపోతే.. మరి వాటి గురించి బహిరంగ వేదికపై ఎందుకు ప్రస్తావిస్తున్నావు ? ఒకవేళ ఆ డాన్సర్ నిన్ను జీరో జీరో అని పిలిచిందంటే.. నీతో ఆమెకు ఎదురైన అనుభవాల ఆధారంగానే అలా చెప్పి ఉండొచ్చు కదా.. ఆమె స్వయంగా ఎదుర్కొన్న అనుభవాల గురించి మాట్లాడుతుంటే, నిజాన్ని బయటపెడుతున్నందుకు నీకు ఎందుకు అంత ఇబ్బంది. రియాలిటీ షో జడ్జిగా అంతటి ఉన్న స్థానంలో ఉన్నప్పటికీ ఒక నిర్దిష్ట పరిస్థితిలో నీకు మద్దతుగా నిలబడి , నిన్ను సమర్థించేవారు నీకు అవసరమవుతున్నారు అంటే .. నా తరపున నిలబడి, నిజాన్ని బయటపెడుతూ నాకు మద్దతుగా మాట్లాడుతున్న వారికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి వారిని ఆపుతున్నావు అసలు నువ్వు ఎవరు? నీకు ఏం హక్కు ఉంది?

నన్ను మాట్లాడకుండా.. నా నోరు మూయించలేరు..

Advertisement

దాదాపు నాలుగేళ్ల పాటు ఎన్నో కష్టాల అనుభవించాను. ఇప్పుడు నా కాళ్ళపై నేను నిలబడి నాకు ఎదురైన అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడే స్థాయికి వచ్చాను. అలాంటప్పుడు నన్ను కానీ, నాకు సపోర్ట్ గా నిలిచే వారిని కానీ అడ్డుకునే హక్కు నీకు లేదు.. నా కథను నేను చెప్పుకోకుండా ఎవరు నా నోరు మూయించలేరు” అంటూ ఆమె తన పోస్టులో సుదీర్ఘంగా రాసుకొచ్చింది. మొత్తానికైతే జానీ మాస్టర్ చేసిన కామెంట్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ శ్రేష్టి వర్మ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

?utm_source=ig_web_copy_link&xtok=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

Related News

చామంతి హీరోయిన్ అవుట్.. కారణం ఏంటో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన మనోజ్.. చింతామణి ప్లాన్ సక్సెస్.. మీనా గ్రేట్..

Karthika Deepam 2 Serial Today Episode October 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి పెద్ద షాక్ ఇచ్చిన జ్యోత్స్న  

Podarillu Today Episode : నిజం తెలిసి కన్నీళ్లు.. అయ్యో పాపం కన్నా.. ఇంట్లో నుంచి మహా వెళ్తుందా..?

Brahmamudi Serial Today Episode October 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తీసుకెళ్లిన చలపతి – రెచ్చిపోయిన రేఖ

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు ఇంట బతుకమ్మ సంబరాలు.. వల్లి కన్నీళ్లు.. భద్ర మాస్టర్ ప్లాన్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Big Stories

Advertisement
×