BigTV English

Rahul Gandhi | గుడి ఎదుట రాహుల్ గాంధీ ధర్నా.. అయోధ్య వేడుక వేళ అస్సాంలో హైడ్రామా!

Rahul Gandhi | అస్సాంలోని హైబోరా గ్రామంలో సోమవారం శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర్ మందిర్ అనే దేవాలయంలో ప్రవేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ గుడి బయటే నిరసన తెలియజేస్తూ ధర్నాపై బైఠాయించారు.

Rahul Gandhi | గుడి ఎదుట రాహుల్ గాంధీ ధర్నా.. అయోధ్య వేడుక వేళ అస్సాంలో హైడ్రామా!

Rahul Gandhi | అస్సాంలోని హైబోరా గ్రామంలో సోమవారం శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర్ మందిర్ అనే దేవాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రవేశం లేదని అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ గుడి బయటే నిరసన తెలియజేస్తూ ధర్నాపై బైఠాయించారు.


రాహుల్ గాంధీ ఇటీవల ప్రారంభించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అస్సాంలోని బోద్రోవా థాన్ మందిర్ దేవాలయంలో పూజ చేయడానికి వెళ్లారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన భగవాన్ శ్రీ రాముడి స్మరిస్తూ పూజ చేయడానికి వెళుతుండగా.. ఆయనతోపాటు మిగతా కాంగ్రెస్ నాయకులను హైబొరా గ్రామంలో కొంత మంది దేవాలయ సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో రాహుల్ గాంధీ, మిగతా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దేవాలయం ఎదుటే రోడ్డుపై ధర్నా చేస్తూ కూర్చుకున్నారు. ధర్నాలో కూర్చొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై రాహుల్ గాంధీతో పాటు మహిళలు కూడా కూర్చొని ధర్నా చేశారు. అందరూ కలిసి రఘుపతి రాఘవ రాజా రామ్ అంటూ భజనలు పాడారు.


ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేశ్ స్థానిక ప్రభుత్వాధికారులపై మండిపడ్డారు. ”మేమంతా ఒక ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాము. కానీ ఇక్కడ మాతో పాటు ఈ ప్రాంత ఎంపీ గౌరవ్ గోగోయ్‌ని కూడా గుడిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం,” అని అన్నారు.

ఆ తరువాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ”త్వాధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. మమ్మల్ని గుడిలో పోనివ్వకుండా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి. ప్రధాని మోదీని విమర్శిస్తే.. ఇలా చేస్తారా?.. మేమిక్కడ రాజకీయాలు చేయడం లేదు. కేవలం గుడిలో ప్రశాంతంగా పూజ చేసుకొన వెళ్లిపోతాం. ఇప్పుడు గుడిలో ఎవరు పూజ చేయాలో? ఎప్పుడు పూజ చేయాలో? ప్రధాని మోదీ నిర్ణయిస్తారా?”అని ప్రశ్నించారు.

శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర్ మందిర్ లేదా బోద్రోవా థాన్ మందిర్ అని పిలవబడే ఈ దేవాలయంలో సోమవారం సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు గుడి చుట్టూ మోహరించారు. కేవలం ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీకి మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ ఎంపీతో పాటు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉండడంతో వారిని అనుమతించవద్దని పై నుంచి ఆదేశాలున్నట్లు గుడి సిబ్బంది తెలిపారు.

గుడి సిబ్బంది మీడియాని కూడా దేవాలయ పరిసరాల్లో అనుమతించడం లేదు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు లాల్ జీ దేశాయ్ మాట్లుడుతూ.. ”లో పూజలు చేస్తే సమస్య ఏంటి?.. వాళ్లు ఇలా అడ్డుకోవడం చాలా సిగ్గుచేటు. ప్రధాన మంత్రి మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత.. వీరిద్దరే ఈ ఘటనకు బాధ్యలు. వారి ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.” అని అన్నారు.

ఆ తరువాత దేవాలయ కమిటీ అధ్యక్షుడు యోగేంద్ర నారాయణ్ దేవ్ ఈ ఘటనపై స్పందించారు. రాహుల్ గాంధీ ఈ గుడికి వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. అయోధ్యలో వేడుకల సందర్భంగా ఈ దేవాలయంలో కూడా వేడుకలు చేస్తున్నాము. అందుకే మధ్యాహ్నం 3 గంటల తరువాత రాహుల్ గాంధీ పూజలు చేసుకోవచ్చు. అని అన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×