BigTV English

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్..!

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్..!

Railway JobsRailway RPF Notification 2024: పది, ఇంటర్, డిగ్రీ అర్హతతలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. త్వరలోనే భారీ సంఖ్యలో భారతీయ రైల్వే శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలు చేయనుంది. ఇటీవలే రైల్వే శాఖ అసిస్టెంట్ లోకే పైలట్, రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోనే మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రైల్వే ప్రొటెక్షన్ స్పెషన్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ నెలలో అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.


గత నెలలో రైల్వే శాఖ 4,500లకు పైగా ఆర్ఫీఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేసింది. అయితే ఈ వార్తను రైల్వే శాఖ అధికారులు ఖడించారు. అది నిజమైన నోటిఫికేషన్ కాదని.. దాన్ని నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని వెల్లడించింది. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ లో మొత్తం 4,660 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఓ ప్రకటని విడుదల చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరించనున్నట్లు సమాచారం. మరి పోస్టులను బట్టి విద్యార్హత, వయస్సు, జీతం వంటి మొదలైన పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య: 4,660
కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య: 4,208
ఎస్సై పోస్టుల సంఖ్య: 452
అర్హతలు: కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, ఎస్సై పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
వయస్సు: కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారికి 2024 జులై 1 నాటికి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సై అభ్యర్థులు వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. కొందరికి వారి రిజర్వేషన్ బట్టి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలో అర్హత సాధించిన వారికి పీఈటీ టెస్ట్ ఉంటుంది.
వేతనం: కానిస్టేబుల్ పోస్టులకు నెలకు జీతం రూ.21,700 ఉంటుంది. అదే ఎస్పై ఉద్యోగం పొందిన వారికి నెల జీతం రూ.35,400 ఉంటుంది.


భారతీయ రైల్వేశాఖ త్వరలో విడుదల చేయబోయే అధికారిక ప్రకటనలో పైన తెలిపిన వాటిలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కావున అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది.

Tags

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×