BigTV English

Railway New Rules: రైలు ప్రయాణం చేస్తున్నారా ? అప్పర్, లోయర్ బెర్తుల వారికి గుడ్ న్యూస్

Railway New Rules: రైలు ప్రయాణం చేస్తున్నారా ? అప్పర్, లోయర్ బెర్తుల వారికి గుడ్ న్యూస్

Railway New Rules: భారత రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్ల స్లీప్ టైమింగ్స్ మార్చింది. రైల్వే ఎప్పటికప్పుడూ నిబంధనలను మారుస్తూ ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు రైలులోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ చాలా మందికి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పాటించాల్సిన నిబంధనల గురించి అవగాహన ఉండటం లేదు. రైలులో ప్రయాణించే వారు రైల్వే న్యూ రూల్స్ తప్పక గురించి తెలుసుకోవాలి.


రైల్వే ప్రయాణికుల స్లీప్ టైమింగ్ మార్చింది. ఏసీ, స్లీపర్ కోచ్‌లలో ఉండే సైడ్ లోయర్ బెర్త్‌లలో ఎక్కువ సేపు పడుకోవద్దని తెలిపింది. అయితై రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంలో ఇతర బెర్త్‌ల ప్యాసింజర్లకు ఊరట కలిగింది. రైలు బోగీలో అప్పర్, మిడిల్ లోయర్ బెర్త్‌లు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఏసీ, స్లీపర్ ట్రైన్‌లలో ప్యాసింజర్లకు మిడిల్ బెర్త్‌లు కేటాయిస్తారు. రాత్రి సమయంలో పడుకోవడానికి మిడిల్ బెర్త్‌లను ప్యాసింజర్లు వాడుకోవచ్చు. అయితే ఈ మిడిల్ బెర్త్‌ల ప్యాసింజర్లు ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని ఒపెన్ చేయడం వల్ల లోయర్ బెర్త్‌లో కూర్చునే ప్యాసింజర్లకు ఇబ్బందిగా ఉంటుంది.

మరోవైపు మిడిల్ బెర్త్ ప్యాసింజర్లు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు పడుకుంటుండటంతో లోయర్, అప్పర్ బెర్త్ లప్యాసింజర్‌లకు అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ విషయంపై ప్రయాణికులు తరుచూ ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మిడిల్ బెర్త్ ప్యాసింజర్ల స్లీప్ టైమింగ్స్ కూడా మార్చింది.


టైమింగ్ మార్పు:
రైల్వే తాజా రూల్స్ ప్రకారం.. స్లీపర్, ఏసీ కోచ్‌లలో ప్యాసింజర్లకు కేటాయించిన బెర్తుల్లో ఇక నుంచి 8 గంటలు మాత్రమే పడుకోవాలి. అంతకు ముందు ఈ సమయం 9 గంటలు ఉండేది. దీంతో వారు రాత్రి 9 నుంచి ఉదయం 6 దాకా పడుకోవడానికి వీలుండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం ప్యాసింజర్లు రాత్రి 10 తర్వాతే మిడిల్ బెర్త్ ఓపెన్ చేయాలి. అంతే కాకుండా ఉదయం 6 కాగానే మిడిల్ బెర్త్ క్లోజ్ చేయాలి. పగటి పూట మిడిల్ బెర్త్ ప్యాసింజర్లు నిద్ర పోకూడదు. ఈ రూల్స్ ప్రకారం  8 గంటలు పూర్తయ్యాక మిడిల్ బెర్త్‌ని క్లోజ్ చేయమని అడిగే హక్కు లోయర్ బెర్త్ ప్యాసింజర్లకు ఉంటుంది. అయితే ఈ కొత్త రూల్స్ ప్యాసింజర్లు తప్పక పాటించాలని రైల్వే శాఖ తెలిపింది.

Also Read: నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం ప్రారంభం.. బీహార్‌లో ఇద్దరిని..

వీరికి మినహాయింపు:
ఈ రూల్స్ విషయంలో కొందరికి మినహాయింపు ఇవ్వాలని ఇండియన్ రైల్వే ప్రయాణికులను కోరింది. అంగవైకల్యం కలిగిన వారు, గర్భిణులు, వ్యాధిగ్రస్తులు ఎక్కువ సేపు పడుకోవడానికి తోటి ప్రయాణికులు అనుమతించాలని సూచించింది.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×