Graham thorpe cause of death(Sports news today): ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, 55 ఏళ్ల గ్రాహమ్ థోర్ప్ హఠాత్తుగా కన్నుమూయడంతో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ ఈ లెఫ్ట్ హ్యాండర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందినట్టు ఇటీవల ఓ ప్రకటన వెలువడింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక సంచలనాత్మకమైన విషయం బయటపడింది.
థోర్ప్ భార్య అమందా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్తది సహజ మరణం కాదని.. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించింది. తను రెండేళ్ల నుంచి మానసికంగా కుంగిపోయి ఉన్నారని, అది ఎందుకో తెలీదని అన్నారు. అప్పుడే ఆత్మహత్యా ప్రయత్నం చేశారని తెలిపారు. ఆనాటి నుంచి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని తెలిపారు.
ఒకసారి పరిస్థితులు విషమించడంతో థోర్ప్ ని చాలాకాలం ఆస్పత్రిలోనే ఉంచామని అన్నారు. అది కూడా ఐసీయూలో ఉన్నారని తెలిపారు. ఆయన మెదడులో తీవ్ర అలజడి రేగి, ఏదో జరిగిపోతుందనే భావనతో డిప్రెషన్ కి గురయ్యేవారని అన్నారు. అయితే మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ఈసారి అతన్ని కాపాడుకోలేకపోయామని అన్నారు. తనను అమితంగా ప్రేమించే భార్యాపిల్లలు ఉన్నప్పటికి, తను ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నాడని భావోద్వేగానికి గురయ్యారు. తనని గుర్తు పెట్టుకుని ఫోన్ చేసిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు.
ఈ విషయాన్ని థోర్ప్ కుమార్తె కిట్టీ కూడా సమర్థించింది. తమనెంతో ప్రేమించిన తండ్రి ఇలా అకాలమరణం పొందడం బాధగా ఉందని తెలిపింది. ఒత్తిడిని అధిగమించలేక తమకు శాశ్వతంగా దూరమైపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.
థోర్ప్ మరణవార్త ఆగస్టు 5న వెలువడింది. 2022లో ఆఫ్గనిస్తాన్ కు హెడ్ కోచ్ గా తను పనిచేశాడు. అప్పటి నుంచే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవాడు. ఆ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఫలానా వ్యాధి అనేది స్పష్టంగా తెలీదు.
ఎడమ చేతి బ్యాటర్ అయిన థోర్ప్ 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్ జట్టులో కెరీర్ కొనసాగించాడు. తను జట్టులో కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ గా ఉండేవాడు. 100 టెస్టులు ఆడిన థోర్ప్ 44.66 సగటుతో 6,744 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలున్నాయి. 82 వన్డేలు ఆడి 37 సగటుతో 2830 పరుగులు చేశాడు. కౌంటీ జట్టు సర్రేకు 17 ఏళ్లపాటు సేవలందించాడు. 20వేల పైనే పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ ముగిసిన తర్వాత కోచ్ గా పనిచేశాడు.