Big Stories

Secunderabad MP Candidates: ఎంపీ బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు.. గెలిచేదెవరో..?

Secunderabad MP Candidates
Secunderabad MP Candidates

Secunderabad MP Candidates (Telangana politics): సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించింది. ప్రస్థుత సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

కాగా ఇటీవలే కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌‌కు సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరం కానుంది. ఎంపీ బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు అమీతుమీ తేల్చుకోనున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఇదే స్ధానం నుంచి పోటీ చేయనున్నారు.

- Advertisement -

అటు పద్మారావు గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆడం సంతోష్ కుమార్‌పై 45 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.

ఇప్పటికీ 14 లోక్‌సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా నల్గొండ, భువనగిరి, హైదరాబాద్ స్థానాలు పెండింగ్ ఉన్నాయి. శుక్రవారం నాగర్ కర్నూల్, మెదక్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు నాగర్ కర్నూల్, మాజీ కలెక్టర్ వెంకట్ రామిరెడ్డికి మెదక్ స్థానాన్ని కేటాయించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News