Red Sandalwood : ఎర్రచందనం సాగు,ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.
Red Sandalwood : ఎర్రచందనం సాగు,ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తొలగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. “రైతులు ఇకపై ఎర్రచందనం సాగు చేసుకోవచ్చు. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన కన్వెన్షన్‌లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై రైతులు ఎర్రచందనాన్ని పండించి, ఎగుమతి చేయడానికి వీలుపడుతుంది. 2004 నుంచి భారత్‌లో లభ్యమయ్యే ఎర్రచందనం సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష కింద ఉండటంతో సాగు, ఎగుమతులపై నిషేధం విధించబడింది. సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ నుంచి తొలగించడం వల్ల రైతులకు ఎర్రచందనం సాగుకు ప్రోత్సాహం లభిస్తుంది,” అని
ఆశాభావం వ్యక్తం చేశారు.