
Jr Ntr : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యామిలీ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పార్టీకి టాలీవుడ్ లో పలువురు సినీ సెలబ్రిటీలకు ఆహ్వానం వెళ్ళింది. ఇక మెగా వారి ఇంట్లో ఘనంగా జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ కు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ రామ్ చరణ్ కుమార్తె కోసం వివిధ రకాల కానుకలను తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారు .
జూనియర్ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీపావళి పార్టీకి తన భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్..రామ్ చరణ్ కూతురు కోసం ప్రత్యేకమైన గిఫ్ట్ తీసుకువచ్చారట. గిఫ్ట్ అంటే ఏదో తెచ్చామన్నట్టు కాదు.. పాప కరెక్ట్ గా ఆడుకునే విధంగా ఎంతో ఆలోచించి ఎన్టీఆర్ ఆ గిఫ్ట్ తెచ్చారట.
క్లింకారా ప్రస్తుతం బొమ్మలను గుర్తుపట్టి ఆడుకునే వయసుకు వచ్చింది కాబట్టి పాప కోసం స్పెషల్ గా కొన్ని రకాల టాయ్స్ గిఫ్ట్ సెట్ ఎన్టీఆర్ తీసుకువచ్చారు. వివిధ రకాల బొమ్మలతో ఉన్న ఈ టాయ్స్ ఐదు సంవత్సరాల వయసు వరకు ఆడుకునే విధంగా ఉపయోగ పడుతుందని. నార్మల్ గా యూస్ అండ్ త్రో టైప్ టాయ్స్ ను ఉపాసన పెద్దగా ఇష్టపడదట. అందుకే ఎన్టీఆర్ ,లక్ష్మీ ప్రణతి ప్రత్యేకంగా ఉపాసన టెస్ట్ కు అనుగుణంగానే గిఫ్ట్ ను తీసుకువచ్చారు.
ఈ పార్టీలో కొత్త వధూవరులు లావణ్య ,వరుణ్ తేజ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పార్టీకి వచ్చిన అందరూ సెలబ్రిటీసు పాప కోసం గిఫ్ట్స్ తీసుకువచ్చినప్పటికీ ఎన్టీఆర్ తెచ్చిన గిఫ్ట్ మాత్రం కాస్త హైలైట్ అయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం మెగా వారి దీపావళి సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న అన్ని తరాల హీరోలు ఆల్మోస్ట్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు కూడా తెగ ఖుష్ అవుతున్నారు.