BigTV English

Ayodhya : అయోధ్య బాలరాముడి దర్శన సమయాలివే..! ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దివ్యమైన ముహూర్తంలో అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోదీ చేతులమీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు , సాధువులు, వివిధ రంగాలకి చెందిన వ్యక్తులు, భక్తులు హజరు అయ్యారు .విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సామాన్య ప్రజలు రావొద్దని ఆలయ ట్రస్ట్ సభ్యులు కోరారు. భారీగా భక్తులు రావడం వల్ల భద్రతా సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు . జనవరి 23 నుంచి బాలరాముడి దర్శనం ప్రతిఒక్కరు చేసుకోవచ్చని ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు.

Ayodhya : అయోధ్య బాలరాముడి దర్శన సమయాలివే..!  ఆన్‌లైన్ బుకింగ్ ఇలా..

Ayodhya : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దివ్యమైన ముహూర్తంలో అభిజిత్‌ లగ్నంలో ప్రధాని మోదీ చేతులమీదుగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు , సాధువులు, వివిధ రంగాలకి చెందిన వ్యక్తులు, భక్తులు హజరు అయ్యారు.విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సామాన్య ప్రజలు రావొద్దని ఆలయ ట్రస్ట్ సభ్యులు కోరారు. భారీగా భక్తులు రావడం వల్ల భద్రతా సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు . జనవరి 23 నుంచి బాలరాముడి దర్శనం ప్రతిఒక్కరు చేసుకోవచ్చని ఆలయ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు.


అయోధ్యలో బాలరాముడి దర్శనం వివరాలు, హారతి ఇచ్చే సమయం వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తమ వెబ్‌సైట్‌లో పొందిపరిచింది. వాటి వివరాలు

దర్శన వేళలు : ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటలు నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు.


జాగరణ హారతి : ఉదయం 6.30 గంటలకు (ఒక రోజు ముందుగానే భక్తులు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది)

సంధ్యా హారతి: రాత్రి 7.30 గంటలకు (అందుబాటును బట్టి అదే రోజు బుక్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది)

రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక గుర్తింపు కార్డును చూపించాలి . హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్‌ ఇవ్వనున్నారు. కానీ అవి పరిమితంగా మాత్రమే జారీ చేస్తారు. ఆన్‌లైన్‌లో కానీ ఆలయం వద్దకానీ పాస్‌ ని తీసుకోవచ్చు. పాస్ లు కలిగిన వారిని మాత్రమే హారతి కార్యక్రమానికి అనుమతిస్తారు. అయితే పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది.

బాలరాముడి దర్శనం/హారతి పాస్‌లకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేయు విధానం

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రవేశ పెట్టిన అధికారిక వెబ్‌సైట్‌ కు వెళ్లాలి.
మీ మొబైల్‌ నంబర్ తో లాగ్ ఇన్‌ అవ్వాలి. తర్వాత అదే నెంబర్ కు ఓటీపి వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేస్తే మీ రిజిస్ట్రేషన్‌ నమోదు పూర్తవుతుంది.
ఒకసారి లాగిన్‌ అయిన తర్వాత ‘మై ప్రొఫైల్‌’ సెక్షన్‌లోకి వెళ్లి మీ పూర్తి వివరాలు, చిరునామా వంటివి ఎంటర్‌ చేయాలి.
ఆ తర్వాత హారతి/దర్శనం టైమ్‌ స్లాట్లను ఎంచుకోవాలి. పాస్‌ కోసం బుక్‌ చేసుకోవాలి.
ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్‌లో మీ పాస్‌లు తీసుకుని దర్శనానికి వెళ్లవచ్చు.

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×