BigTV English

chip making : ‘చిప్’ రంగంలోకి ఓపెన్ ఏఐ?

chip making : కృత్రిమ మేధ(ఏఐ) అప్లికేషన్ల ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సెమీకండక్టర్ చిప్ లకు విపరీతమైన కొరత ఏర్పడనుంది. రానున్న 3-5 ఏళ్ల వరకు చిప్‌లకు డిమాండ్ విపరీతంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొరత భయంతో చిప్ తయారీ రంగంలోకి ఓపెన్ ఏఐ సంస్థ కాలు మోపనున్నట్టు సెమీకండక్టర్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

chip making : ‘చిప్’ రంగంలోకి ఓపెన్ ఏఐ?

chip making : కృత్రిమ మేధ(ఏఐ) అప్లికేషన్ల ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో సెమీకండక్టర్ చిప్ లకు విపరీతమైన కొరత ఏర్పడనుంది. రానున్న 3-5 ఏళ్ల వరకు చిప్‌లకు డిమాండ్ విపరీతంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొరత భయంతో చిప్ తయారీ రంగంలోకి ఓపెన్ ఏఐ సంస్థ కాలు మోపనున్నట్టు సెమీకండక్టర్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.


తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ(TSMC)తో కలిసి ఏఐ చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఆరంభించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఈ మేరకు టీఎస్ఎంసీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. చిప్ తయారీ ప్లాంట్ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్ల సాయంతో శామ్ భారీ మొత్తంలో నిధులు సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు.

మరోవైపు అబుధాబి సంపన్నుల్లో ఒకరైన షేక్ తహనూన్ బిన్ జాయేడ్ అల్-నహ్యాన్‌తోనూ శామ్ మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. గల్ఫ్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్-నహ్యాన్‌కు తహనూన్ స్వయానా సోదరుడు. అలాగే 800 బిలియన్ డాలర్ల విలువ ఉన్న అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ప్రభుత్వానికే చెందిన మరో పెట్టుబడి సంస్థ ఏడీక్యూ నుంచి నిధుల సమీకరించేందుకు శామ్ తీవ్రంగా యత్నిస్తున్నారు.


టీఎస్ఎంసీ చిప్‌లను యాపిల్ లాప్‌టాప్‌లు, ఫోన్లలో వినియోగిస్తున్నారు. ఇక సీపీయూ చిప్‌లను తయారు చేసే రెండు ప్రధాన కంపెనీలు ఏఎండీ, ఇంటెల్.. డిమాండ్ తగ్గట్టుగా చిప్‌లను సరఫరా చేయడంలో సతమతమవుతున్నాయి.

Tags

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×