BigTV English
Advertisement

Robot: రింజిం రింజిం రోబోట్.. రిక్షా వాలా జిందాబాద్..

Robot: రింజిం రింజిం రోబోట్.. రిక్షా వాలా జిందాబాద్..
robot Rickshaw

Robot: టెక్నాలజీతో ఏదైనా సాధ్యం అయ్యే రోజులివి. కృత్రిమ గుండెతో మనిషి ప్రాణాలు నిలుపుతున్నారు. అంతరిక్షంలో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. భూమి, ఆకాశాలనే హద్దు లేకుండా సైన్స్ అనేక సంచలనాలు సృష్టిస్తోంది. పెద్ద పెద్ద వాటిల్లోనే కాదు.. చిన్నచిన్న విషయాల్లోనూ మేధస్సు మెప్పిస్తోంది. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ టెక్నాలజీతో ఆటాడుకుంటున్నారు. ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే అనేక పరికరాలు, వస్తువులు తయారు చేస్తున్నారు. అలాంటిదే ఈ మరో ఆవిష్కరణ కూడా… ఇంతకీ ఇదేంటంటే…


రిక్షా. రోబోట్ రిక్షా. అంటే రోబో లాగే రిక్షా అన్నమాట. వెనుక ట్రాలీలో ప్యాసింజర్లు కూర్చుంటారు. ముందు మనిషి లాగడానికి బదులు, ఆ ట్రాలీని రోబో లాగుతుందన్న మాట.

అచ్చం రిక్షా పుల్లర్ లానే పని చేస్తుందీ రోబోట్. మనిషిలానే కాళ్లు కదుపుతుంది. చేతులతో ట్రాలీని గట్టిగా పట్టుకుని.. ముందుకు లాగుతుంది.


ఈ రోబో రిక్షా తయారీకి కేవలం 25 వేల నుంచి 30 వేలు మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు.

ఈ రోజుల్లో రిక్షాలు ఎవరు వాడుతున్నారనే డౌట్ రావొచ్చు. అయితే ఈ రోబో రిక్షా లాగడానికి కాదట తయారు చేసింది. మనషిని పోలిన మనిషిని తయారు చేసే క్రమంలో మొదటి ఆవిష్కరణ అని చెబుతున్నారు. ముందు కాళ్లు తయారు చేశారట. అది సక్సెస్‌ఫుల్‌గా పని చేస్తోంది. ఆ కాళ్ల రోబోట్‌ను టెస్ట్ చేయడానికే.. పైన మొండెం, తల లాంటి బొమ్మ పెట్టి.. ఇలా రిక్షా పుల్లర్‌గా మార్చేశారట. టెస్ట్ చేస్తే.. ఆ కాళ్లు అచ్చం మనిషిలానే పని చేస్తున్నాయి. ఈ స్పూర్తితో ముందుముందు మిగతా మనిషి భాగాలు సైతం రూపొందిస్తామని కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు.

అలా పూర్తి స్థాయి రోబోట్ తయారైతే.. అది ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు. హాస్పిటల్స్‌లో, ఆర్మీలో ఇలాంటి మనిషిని పోలిన రోబోట్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయని చెబుతున్నారు. ఇంతకీ ఇది తయారు చేసింది ఎవరంటే.. సూరత్‌లోని ఓ యూనివర్సిటీ స్టూడెంట్స్.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×