BigTV English

India foreign Relation: ఏకమవుతున్న రష్యా, ఇండియా, చైనా.. అమెరికాకు టెన్షన్..

India foreign Relation: ఏకమవుతున్న రష్యా, ఇండియా, చైనా.. అమెరికాకు టెన్షన్..

India foreign Relation: RIC ఏకమవుతుందా? రష్యా, చైనా, ఇండియా ఒక్కతాటిపైకి వస్తున్నాయా? అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు.. టారిఫ్‌ వార్నింగ్‌లకు చెక్ పెట్టెందుకు తెర వెనక వ్యూహాలు రచిస్తున్నాయా? అనే అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. రష్యా, భారత్, చైనా త్వరలోనే ఓ సమావేశాన్ని నిర్వహించబోతున్నాయి అనే ప్రచారం ఇప్పుడు ఉధృతమైంది. రష్యాపై ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా ప్రకటించడం.. భారత్, చైనా, బ్రెజిల్‌పై వందశాతం టారిఫ్‌లు విధిస్తామంటూ నాటో చీఫ్‌ మాట్లాడటం.. బ్రిక్స్ దేశాలకు వడ్డింపు తప్పదంటూ ట్రంప్ బెదిరించడం.. ఇలాంటి కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో ఈ భేటీ జరుగుతుందన్న ప్రచారం ఒక కొత్త చర్చకు తెరలేపింది. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టే సంచలన నిర్ణయాలు ఈ భేటీలో ఉండబోతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది.


త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తారంటూ ప్రచారం
అయితే ఈ త్రైపాక్షిక చర్చలకు సంబంధించి భారత విదేశాంగశాఖ స్పందించింది. ఇప్పటికిప్పుడే అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని తెలిపింది. అలాగని జరగకుండా ఉండే అవకాశం లేదని ప్రకటించింది. ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రకటించింది. ఒకవేళ షెడ్యూల్ ఫిక్స్ అయితే అధికారికంగా ప్రకటిస్తామంది.

పశ్చిమ దేశాల ఆధిపత్యానికి చెక్ పడ్డట్టే అంటూ ప్రచారం
రష్యా, చైనా, భారత్‌ నిజంగానే కలిసి పనిచేస్తే పశ్చిమ దేశాల ఆధిపత్యానికి గండి పడినట్టే అని చెప్పాలి. అయితే ఈ ఆలోచన ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా చర్చలో ఉన్నదే. ఇప్పటికే 20కి పైగా సమావేశాలు కూడా జరిగాయి. విదేశాంగమంత్రులు, ఆర్థికమంత్రుల సారథ్యంలో ఈ భేటీలు జరిగాయి. అయితే భారత్-రష్యా మధ్య ఇలాంటి చర్చలు జరగడం సాధారణమే అని చెప్పాలి.


కరోనా, గల్వాన్‌ ఘర్షణల కారణంగా ఆలస్యం
ఈ భేటీల్లో పాల్గొనేందుకు చైనా కూడా ఆసక్తి కనబరిచింది. ఈ మూడు దేశాలు కలిసి పనిచేస్తే ట్రేడ్‌ విషయంలోనే కాదు… ఈ ప్రాంత భద్రత, స్థిరత్వానికి కూడా మంచిదంటూ వ్యాఖ్యానించింది. మొత్తానికి RICకి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ సిద్ధమవుతోంది. కరోనా, గల్వాన్‌ ఘర్షణ లేకపోతే ఇప్పటికే కీలక అడుగులు పడేవి. ఇప్పుడు మళ్లీ ట్రంప్, నాటో పుణ్యమా అని మళ్లీ ఈ ఆలోచన తెరపైకి వచ్చింది.

Also Read: ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తి వేస్తారా

అమెరికా రాజకీయ దెబ్బ..
భారత్, చైనా, రష్యా కలిసి మళ్లీ RICను ప్రారంభిస్తే, ఆసియాలో కొత్త వ్యూహాత్మక సమతుల్యత ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. భారత్ ఇప్పటికే సభ్య దేశాలలో ఒకటిగా ఉంటుంది. అయితే దీనిలో భాగమైన పశ్చిమ దేశాలు చైనాను చుట్టుముట్టే ఉద్దేశంతో ఈ గుంపును ఏర్పాటు చేశాయని చైనా భావిస్తుంటున్నారు. మళ్లీ ఇప్పుడు భారత్ RICలో చురుకుగా పాల్గొంటే, అమెరికాకు ఒక పెద్ద రాజకీయ దెబ్బగా మారే అవకాశం ఉంది అంటున్నారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×