BigTV English

Satyavedu MLA Adimulam: ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తి వేస్తారా?

Satyavedu MLA Adimulam: ఆదిమూలంపై సస్పెన్షన్ ఎత్తి వేస్తారా?

Satyavedu MLA Adimulam: సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలం … పార్టీ ఆయన్ని పక్కనపెట్టినా సీఎంతో పాటు ప్రభుత్వం తరుపున ఎవరు జిల్లాకు వచ్చినా సదరు కార్యక్రమాల్లో ముందుంటారు. అయన ఓ ట్రాప్ ద్వారా వివాదాలలో చిక్కుకున్నారన్న అభిప్రాయం ఉంది .. ఆ క్రమంలో ఆదిమూలంపై సస్సెషన్ ఎత్తి వేస్తారా? లేక కొనసాగిస్తారా అన్నది పార్టీ శ్రేణులకు బేతాళ ప్రశ్నగా మారింది. ఆ క్రమంలో ఆ రిజర్వ్‌డు నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జ్‌ల పేరుతో వచ్చిన వ్యక్తులు ప్రభుత్వ వ్యవహారాల్లోలో సైతం పెత్తనం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయంట. ఆదిమూలం సైతం ఇది మంచి పద్దతి కాదని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చారు ..అసలు సత్యవేడు లో పరిస్థితికి కారణమేమిటి?


సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలాన్న పక్కనపెట్టిన జగన్

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఏడాదిన్నరగా రాజకీయంగా వార్తలకు ఎక్కుతోంది. ఎన్నికల ముందు వైసీపీ అధ్యక్షుడు జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలాన్ని కాదని ఎంపి గురుమూర్తికి టికెట్ ఇవ్వడంతో నియోజకవర్గంలో పెద్దిరెడ్డి దందా నడుస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఆదిమూలం తిరుగుబాటు బావుటా ఎగరేశారు. దాంతో ఆదిమూలం జాతకం అనూహ్యంగా మారిపోయింది .. వారం రోజుల తర్వాత ఆయన సత్యవేడు టీడీపీ అభ్యర్థి అయ్యారు .. టీడీపీలోని మెజార్టీ గ్రూపులు వ్యతిరేకించినా చంద్రబాబు సునామీలో ఆయన మూడు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు… నియోజకవర్గంలో పరిస్థితి గాడిన పడుతుందనుకుంటున్న సమయంలో టీడీపీలోని పరిశీలకుల పేరుతో కొందరు నేతలు పెత్తనం స్టార్ట్ చేశారంట. నియోజకవర్గంలో కింగ్ మేకర్లుగా వారు తమ ప్రతాపం చూపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది


ఆదిమూలంపై అసభ్య విడియో విడుదల చేసిన మహిళ

గ్రావెల్ తరలింపుతో పాటు సహాజవనరులు తరలింపు విషయంలో ఎమ్మెల్యే వర్సెస్ పరిశీలకుడు అయిన చంద్రశేఖర్ నాయుడు మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ సమయంలో ఉన్నట్లుండి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశం పార్టీ మండల నాయకురాలు ఓ విడియో విడుదల చేసింది..తనను బ్లాక్ మేయిల్ చేసి బలవంతంగా ఆదిమూలం పలుమార్లు అనుభవించాడని అమె అరోపించింది. దీంతో వెంటనే పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలాన్ని సస్పెండ్ చేసారు… తర్వాత ఆ మహిళ తన అరోపణలు ఉపసంహరించుకుంది. అయితే ఆ కేసు నుంచి బయటపడ్డానికి పార్టీలోని ఓవర్గం ఎమ్మెల్యేకి సహకరించి ఆయన్ని తమ కనుసన్నలలో ఉంచుకుందనే ప్రచారం జరిగింది..

రోజు వందల టిప్పర్లతో తరలిపోతున్న మట్టి

ఇలాంటి సమయంలో నియోజకవర్గంలో పరిశీలకులుతో పాటు అనేక మంది పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఎలాంటి పర్మిషన్లు లేకుండా వందల టిప్పర్లతో మట్టి తరలిపోతుందనే అరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఏమి మాట్లాడలేని పరిస్థితి..చంద్రశేఖర్ నాయుడికి తోడు సూళ్ళురు పేట నియోజకవర్గానికి చెందిన శ్రీపతి బాబును కూడా సత్యవేడు పార్టీ అబ్జర్వర్ గా టీడీపీ అధిష్టానం నియమించింది. అయితే వారిద్దరు స్థానికులు కాకపోవడంతో స్థానిక క్యాడర్ తీవ్రంగా అగ్రహంగా ఉందట. ఇలాంటి సమయంలో నారా లోకేష్ నియోజకవర్గంలో పర్యటించారు .. ఆ సమయంలో అయనకు పరిస్థితి అర్థం అయ్యిందంటున్నారు. నాన్ లోకల్స్ పట్ల క్యాడర్ వ్యతిరేకతను గుర్తించిన లోకేష్ స్థానికుడైన శంకర్‌రెడ్డిని పార్టీ క్యార్యక్రమాల నిర్వహణ ఇన్చార్జ్‌గా నియమించారు..

శ్రీకాళహస్తి టికెట్, తుడా చైర్మన్ పోస్టు ఆశించిన శంకర్‌రెడ్డి

పార్టీ కార్యక్రమల నిర్వహాణ కోసం నియమించిన కన్వీనర్ శంకర్‌రెడ్డి ది సత్యవేడు నియోజకవర్గం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఆయన శ్రీకాళహస్తి టికెట్ రేసులో కూడా పోటీ పడ్డారు .. తర్వాత తుడా చైర్మన్ పదవి కూడా అశించి భంగపడ్డారు.. ఈ స్థితిలో రెండు రకాలుగా ప్రయోజనం చేకూరే విదంగా పార్టీ నిర్ణయం తీసుకుంది..శంకర్ రెడ్డిని పార్టీ కన్వీనర్ గా సత్యవేడుకు నియమించింది. అయితే కాంట్రాక్టర్ గా శంకర్ రెడ్డికి అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు ఉన్నాయి.. ఈనేపథ్యంలో శంకర్ రెడ్డి నియోజకవర్గంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. అధికార యంత్రాగం అయన సహకరిస్తుస్తోందంట… రాజ్యాంగ బద్ద పదవి లేక పోయినప్పటికి పోలీసులు సెల్యూట్ లు చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దానికితోడు అయన ఎక్కడ పర్యటిస్తే అక్కడ అధికార యంత్రాగం హడావుడి చేస్తుండటం విమర్శలపాలవుతోంది

మైనింగ్ ఓనర్లను బెదిరిస్తు్న్నారని ఎమ్మెల్యే ఆగ్రహం

ఆ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే ఆదిమూలం తన నిరసన గళాన్ని వినిపించారు ..మైనింగ్ ఓనర్ల కొంతమంది బెదిరిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేసారు .. దాంతో పాటు శంకర్ రెడ్డిని పార్టీ కార్యక్రమాల కోసం మాత్రమే నియమించారని పార్టీ ఇన్చార్జి కాదని ధ్వజమెత్తారు. ఫ్లెక్సీలు కట్టి హాడావుడి చేస్తే ప్రజలు నాయకుడిగా అంగీకరించరని యద్దేవా చేశారు .. తాను చంద్రబాబుకు విధేయుడినని అయన తనకు సీటు ఇవ్వడమే కాకుండా… తన కోసం నియోజకవర్గంలో పర్యటించి తన గెలుపు కోసం శ్రమించారని గుర్తు చేశారు .. తాను టిటిడి తరపున పోటీ చేసినప్పుడు టిడిపిలో ఉన్న తన ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే హేమలతా అయితే ఇండిపెండెంట్ అభ్యర్ధికి తమ ఇంటిని కార్యాలయం కోసం అద్దెకిచ్చి తనను ఇబ్బంది పెట్టారని అగ్రహం వ్యక్తం చేసారు. తనను పార్టీ సస్పెండ్ చేసిందని అయితే తన కూమారుడిని చేయలేదని అలాంటప్పుడు తన కూమారుడిని పక్కన పెట్టుకుని కార్యక్రమాలు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.

నరసింహ యాదవ్ పై అదిమూలం ఆరోపణలు

తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్ తో పాటు స్థానిక నేతల కుట్ర కారణంగా తాను పార్టీకి దూరమయ్యానని పలువురి వద్ద ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది… తాజాగా అయన బహిరంగంగా కూడా నరసింహయాదవ్ ఎవ్వరు అయన చేస్తున్న చర్యలేంటి అని ప్రశ్నించారు. అదికారులు ఎవ్వరి మాటా వినాల్సిన అవసరం లేదన్నారు. తాను వారికి అండగా ఉన్నానన్నారు..శంకర్ రెడ్డి సైతం అలోచించుకోవాలని … అయన తనకు వ్యతిరేకి కాదని పక్క నియోజకవర్గాలలో ఎమ్మెల్యేని కాదని కార్యక్రమాలు చేస్తారా అని ప్రశ్నించారు..

త్రీమెన్ కమిటీ కోసం క్యాడర్ డిమాండ్

మొత్తం మీద ఇన్ని రోజులుగా తన మీదా పెత్తనం చేస్తున్నవారిపై ఆదిమూలం ఓపెన్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది .. భవిష్యత్తులో ఈ వివాదం పెద్దది కాకుండా పార్టీ చర్యలు తీసుకోవాలని క్యాడర్ కోరుతోంది ..ఇంకా నాలుగు సంవత్సరాలు పాటు ఆదిమూలమే ఎమ్మెల్యేగా ఉంటారని … రిజర్వ్ డు స్థానం లో అగ్ర వర్ణాల పెత్తనం అనే చెడ్డపేరు రాకుండా ఆదిమూలం కూమారుడిని కలుపుకోని త్రిమ్యాన్ కమిటి లాంటిది వేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.. దానికితోడు పార్లమెంట్ అధ్యక్షుడి రాజకీయం మూలంగా సత్యవేడు లో పార్టీ సిన్సియర్ కార్యకర్తలు దూరం అవుతున్నారని గతంలోనే పార్టీకి కొంతమంది నేతలు లేఖలు సైతం రాసారంట..మొత్తం గాయాన్ని తొందరగా నయం చేయక పోతే అది రాచపుండుగా మారే అవకాశముందని అంటున్నారు.

Also Read: జగన్మోహన్ లీలల పై సీఐడీ ప్రశ్నల వర్షం

ఆదిమూలం ఆవేదనను పార్టీ అధిష్టానం గుర్తించాలని, అయన కూమారుడు నారాయణవనం జడ్పీటిసి అయిన సుమన్ కు పార్టీ కార్యక్రమాలలో అవకాశం కల్పించాలని సత్యవేడు టీడీపీ క్యాడర్ కోరుతోంది… సత్యవేడులో ఉన్న సహజ వనరులు, ఆదాయ అర్జన కోసమే గతంలో ఆదిమూలం పై కుట్ర జరిగిందని అధిష్టానం గుర్తించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.

Story By Rami Reddy, Bigtv

Related News

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Telangana BJP: సీక్రెట్‌గా షోకాజ్ నోటీసులు.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది?

Big Stories

×